ఐపీఎల్ 2024 వేలంలో అమ్ముడుపోని టాప్ ప్లేయర్లు వీళ్లే..!

ఐపీఎల్ 2024 వేలం( IPL 2024 Auction ) మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన విషయం తెలిసిందే.కొందరు స్టార్ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిస్తే.

 Star Players Who Are Unsold In Ipl 2024 Auction Details, Unsold Players, Ipl 20-TeluguStop.com

మరికొందరు స్టార్ ఆటగాళ్లకు తీవ్ర నిరాశ మిగిలింది.ఈ వేలంలో ఆస్ట్రేలియా కు చెందిన ఇద్దరు స్టార్ ఆటగాళ్ల కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి.

ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్( Mitchell Starc ) ఊహించని రీతిలో రికార్డ్ స్థాయి ధర పలికాడు.

కోల్ కత్తా నైట్ రైడర్స్ రూ.24.75 కోట్లు వెచ్చించి మిచెల్ స్టార్క్ ను దక్కించుకుంది.ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ ను( Pat Cummins ) రూ.20.50 కోట్లు వెచ్చించి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ దక్కించుకుంది.

ఇక కొందరు స్టార్ ప్లేయర్లను కొనేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాకపోవడంతో ఆ ప్లేయర్లకు తీవ్ర నిరాశ మిగిలింది.ఆ ఆటగాళ్లు ఎవరో చూద్దాం.ఆస్ట్రేలియా జట్టు స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ను( Steve Smith ) కొనుగోలు చేసేందుకు ఒక ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు.

దీంతో అన్ సోల్డ్ లేయర్ గా మిగిలిపోయాడు.ఇతని కనీస ధర రూ.2 కోట్లు కావడంతో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.

ఈ అన్ సోల్డ్ జాబితాలో వాండర్ డసెన్, ( Vander Dussen ) జేమీ ఓవర్టన్,( Jamie Overton ) బెన్ డకెట్, జేమ్స్ విన్స్, సీన్ అబాట్, జోష్ హేజిల్ వుడ్, ఆదిల్ రషీద్ ఉన్నారు.ఈ ఆటగాళ్ల కనీస ధర రూ.2 కోట్లు ఉండడం వల్లే ఫ్రాంచైజీలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు.జేసన్ హోల్డర్, కొలీన్ మున్రో, టిమ్ సౌథీ, క్రిస్ జోరాల్డ్, డానియల్ సామ్స్, ఫిలిప్ సాల్ట్, జేమ్స్ నీషమ్, టైమల్ మిల్స్ ఆటగాళ్ల కనీస ధర రూ.1.50 కోట్లు ఉండడంతో ఈ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ముందుకు రాకపోవడంతో వీరంతా అన్ సోల్డ్ ప్లేయర్లుగా మిగిలిపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube