భారీగా పెరిగిన రష్మిక ఆస్తుల విలువ.. ఆమె మొత్తం సంపద ఎంతంటే?

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించాలంటే రేయింబవళ్లు కష్టపడటంతో పాటు ఆవగింజంత లక్ కూడా ఉండాలి.

అయితే రష్మికకు( Rashmika ) మాత్రం ఊహించని స్థాయిలో లక్ ఉంది.

ఆమె ఏ సినిమాలో నటించినా ఆ సినిమా మినిమం గ్యారంటీ హిట్ గా నిలుస్తూ ఆమె రేంజ్ ను ఆ సినిమాలు పెంచుతున్నాయి.భాషతో సంబంధం లేకుండా విజయాలు అందుకుంటున్న ఈ బ్యూటీ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.

అయితే ఈరోజు రష్మిక పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ బ్యూటీ ఆస్తుల విలువ ఏకంగా 65 కోట్ల రూపాయలు అని సమాచారం.

ఈ రేంజ్ లో రష్మిక ఆస్తులు సంపాదించిందని తెలిసి నెటిజన్లు సైతం ఒకింత షాకవుతున్నారు.యాడ్స్ ద్వారా కూడా కూడా ఈ బ్యూటీ భారీ రేంజ్ లో సంపాదిస్తున్నారని తెలుస్తోంది.

Advertisement

రష్మిక పారితోషికం( Rashmika Remunaration ) 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

రష్మిక కెరీర్ పరంగా జాగ్రత్తగా అడుగులు వేస్తూ కథ నచ్చితే మాత్రమే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.రష్మిక మందన్న( Rashmika Mandanna ) ప్రస్తుతం నితిన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుండటంతో పాటు పుష్ప2 సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.రష్మిక లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లకు సైతం ఓకే చెబుతూ అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుండటం గమనార్హం.

రష్మిక క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ రెట్టింపు కావాలని 27 సంవత్సరాల వయస్సులోనే ఎన్నో సక్సెస్ లను అందుకున్న ఈ బ్యూటీ నంబర్ వన్ హీరోయిన్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.వివాదాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ పెళ్లికి సంబంధించిన శుభవార్తలను ఎప్పుడు చెబుతారో చూడాల్సి ఉంది.సినిమా సినిమాకు రష్మిక ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ ఇతర హీరోయిన్లకు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తున్నారు.

కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?
Advertisement

తాజా వార్తలు