కొన్నేళ్ల క్రితం వరకు టాలీవుడ్ స్టార్ హీరోలు అన్ని సినిమాలలో ఒకే తరహా లుక్ లో కనిపించేవారు.అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా స్టార్ హీరోలు సైతం కొత్త తరహా లుక్స్ లో కనిపించడానికి ఆసక్తి చూపుతున్నారు.
అభిమాన హీరోలు కొత్త లుక్స్ లో కనిపిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవనే సంగతి తెలిసిందే.సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమా కోసం తన లుక్ ను మార్చుకుంటున్నారని కొత్తరకం హెయిర్ స్టైల్ తో ఈ సినిమాలో కనిపించనున్నారని బోగట్టా.
త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మహేష్ పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో మహేష్ బాబు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో తారక్ స్లిమ్ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.ఈ సినిమా కోసం తారక్ ఏకంగా పది కిలోల బరువు తగ్గనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తారక్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాలో తారక్ డార్క్ లుక్ లో కనిపించనున్నారు.నాని హీరోగా దసరా పేరుతో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో నాని ఊరమాస్ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.ఏజెంట్ సినిమా కోసం అఖిల్ తన లుక్ ను మార్చుకోగా ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ లుక్ లో అఖిల్ కనిపించనున్న సంగతి తెలిసిందే.