సల్మాన్ ఖాన్ తొలి జీతం జూనియర్ ఆర్టిస్ట్ కంటే తక్కువా..?

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ షో సీజన్ 14 హోస్ట్ చేస్తున్న ఆయన బిగ్ బాస్ షో ద్వారా కూడా భారీ మొత్తంలో పారితోషికం అందుకుంటున్నారు.

ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు ఆదాయపు పన్ను కడుతున్న సల్మాన్ తొలి జీతం మాత్రం 100 రూపాయల లోపే కావడం గమనార్హం.ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మూడు దశాబ్దాలు గడిచినా సల్మాన్ ఖాన్ కు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు సరికదా అంతకంతకూ పెరుగుతోంది.

కరోనా వల్ల అతి తక్కువ మంది శ్రేయోభిలాషుల మధ్య పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న సల్మాన్ ఖాన్ బివీ హోతో ఆసి సినిమా ద్వారా 1989 సంవత్సరం సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.అయితే సినిమాల్లోకి రాకముందే ఆయన ఒక హోటల్ లో జరిగిన స్పెషల్ ప్రోగ్రామ్ లో బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా పని చేశారు.

అలా బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా చేసినందుకు సల్మాన్ ఖాన్ కు 75 రూపాయలు పారితోషికంగా దక్కింది.ఈ మొత్తం అప్పట్లో జూనియర్ ఆర్టిస్ట్ తీసుకునే పారితోషికం కంటే తక్కువ కావడం గమనార్హం.అయితే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఏడాదిలోనే ఆయన నటించిన మైనే ప్యార్‌ కియా హిట్ కావడం ఆ తరువాత ఆయన నటించిన సినిమాలన్నీ సక్సెస్ కావడం తెలిసిందే.

Advertisement

అయితే 32 ఏళ్ల సినీ కెరీర్ లో సల్మాన్ ఖాన్ ఇప్పటివరకు లిప్ లాక్ సీన్స్ లో నటించలేదు.సినిమా కథలు ఎప్పుడూ లిప్ లాక్ కిస్ లు డిమాండ్ చేయవని అందుకే వాటిపై తనకు ఆసక్తి ఉండదని ఒక సందర్భంలో సల్మాన్ ఖాన్ వెల్లడించారు.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ అంతిమ్‌: ద ఫైనల్‌ ట్రూత్‌ అనే సినిమాలో నటిస్తున్నారు.మహేశ్ మంజేర్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు