ఆయన నా లైఫ్ ను మార్చిన గొప్ప మహానుభావుడు.. సప్తగిరి కామెంట్స్ వైరల్!

కమెడియన్ గా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలో హీరోగా మారి సప్తగిరి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.

సప్తగిరి ఎక్స్ ప్రెస్, సప్తగిరి ఎల్.

ఎల్.బీ, వజ్ర కవచదర గోవింద గోవింద సినిమాలలో నటించిన సప్తగిరి గూడుపుఠాణి సినిమా సినిమాలో నటించగా త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది.గూడుపుఠాణి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సప్తగిరి మాట్లాడుతూ కృష్ణగారు నటించిన గూడుపుఠాణి టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో నటించడం తన అదృష్టమని అన్నారు.

డైరెక్టర్ కుమార్ చెప్పిన లైన్ తనకు ఎంతగానో నచ్చిందని సప్తగిరి తెలిపారు.థ్రిల్లర్ సినిమాలో తొలిసారి తాను నటిస్తున్నానని ఫస్ట్ లాక్ డౌన్ సమయంలో అవుట్ డోర్ లో ఈ సినిమా షూటింగ్ జరిగిందని సప్తగిరి చెప్పుకొచ్చారు.

హంపి, కంచి, చిక్ మంగళూరు ప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ జరిగిందని సప్తగిరి అన్నారు.నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా రిచ్ గా ఉండేలా ఈ సినిమాను తెరకెక్కించారని సప్తగిరి పేర్కొన్నారు.

Advertisement

తన జీవితాన్ని మార్చిన గొప్ప మహానుభావుడు డైరెక్టర్ మారుతి అని సప్తగిరి తెలిపారు.

మారుతి తెరకెక్కించిన ప్రేమకథాచిత్రమ్ సినిమా ద్వారా తాను స్టార్ కమెడియన్ అయ్యానని మారుతి చెప్పుకొచ్చారు.తాను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉండటానికి కారణం మారుతి అని సప్తగిరి వెల్లడించారు.దర్శకుడు మారుతి తనకు మరో అధ్యాత్మిక మార్గాన్ని కూడా చూపించారని సప్తగిరి అన్నారు.

దర్శకుడు మారుతి చూపించిన మార్గంలో తాను నడుస్తానని సప్తగిరి పేర్కొన్నారు.గూడుపుఠాణి సినిమాలో రఘు కుంచె విలన్ గా నటించారని ఈ సినిమాతో టాలీవుడ్ కు మరో మంచి విలన్ పరిచయమైనట్టే అని సప్తగిరి చెప్పుకొచ్చారు.సప్తగిరి ఈ సినిమాతో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు