నిద్రలేమి..
నేటి టెక్నాలజీ యుగంలో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా కోట్లాది మందిని మదన పెడుతున్న సమస్య ఇది.నిద్ర లేమి అనేది చిన్న సమస్యైతే ఏ మాత్రం కాదనే చెప్పాలి.ఎందుకంటే, నిద్ర లేమిని నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం, మెదడు పని తీరు తగ్గిపోవడం, జీర్ణ వ్యవస్థ దెబ్బ తినడం, ఒత్తిడి, వ్యాధి నిరోధక శక్తి లోపించడం, డిప్రెషన్, చర్మ ఆరోగ్యం క్షీణించడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలే వస్తాయి.
అందుకే నిద్ర లేమిని ఎంతో త్వరగా నివారించుకుంటే ఆరోగ్యానికి అంత ముప్పు తగ్గుతుందని నిపుణులు చెబుతుంటారు.
అయితే నిద్ర లేమిని నివారించడంలో అనాస పువ్వు అద్భుతంగా సహాయపడుతుంది.మసాలా దినుసుల్లో ఒకటైన అనాస పువ్వు ప్రత్యేకమైన రుచి, వాసన కలిగి ఉండటమే కాదు.బోలెడన్ని పోషక విలువలను సైతం నిండి ఉంటుంది.అందుకే అనాస పువ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.
బెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు.మరి ఇంతకీ అనాస పువ్వును ఎలా తీసుకుంటే నిద్ర లేమి దూరం అవుతుందో చూసేయండి.ముందుగా ఒక బౌల్ పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్ పోసి లైట్‌గా హీట్ చేయాలి.ఇప్పుడు ఈ వాటర్‌లో రెండు అనాస పువ్వులు లేదా ఒక స్పూన్ అనాస పువ్వుల పౌడర్ వేసి బాగా మరిగించి ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ వాటర్‌ను రాత్రి నిద్రించేందుకు గంట ముందు సేవించాలి.
ఇలా ప్రతి రోజు చేస్తే. నిద్ర చక్కగా పడుతుంది.
నిద్ర లేమి సమస్య క్రమక్రమంగా దూరం అయిపోతుంది.పైగా అనాస పువ్వులు మరిగించిన నీటిని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
జీర్ణ సంబంధిత సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.మరియు స్త్రీ, పురుషుల్లో సంతాన సమస్యలు సైతం దూరం అవుతాయి.