ఈ స్టార్ యాక్టర్ పారితోషికం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు వరుసగా రెండు మూడు హిట్లు రాగానే పారితోషికం పెంచేస్తారనే సంగతి విదితమే.

తాజాగా అలా పారితోషికం పెంచిన నటుల జాబితాలో ఆర్టిస్ట్ మురళీశర్మ చేరారు.

ఎలాంటి పాత్రలోనైనా అద్భుతంగా నటించి సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషిస్తున్న మురళీశర్మకు స్టార్ హీరోల సినిమాల్లో వరుసగా అవకాశాలొస్తున్నాయి.మురళీ శర్మ అమ్మ తెలుగువారు కాగా నాన్న వ్యాపార రిత్యా ముంబాయిలో స్థిరపడ్డారు.

చిన్నప్పటి నుంచి సినిమాలంటే అమితమైన ఆసక్తి ఉన్న మురళీశర్మ చిన్న వయస్సులోనే నాటకాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.డిగ్రీ పూర్తి చేసిన తరువాత ప్రొడక్షన్ మేనేజర్ గా, టెలిఫోన్ ఆపరేటర్ గా, ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ గా పని చేశారు.

ఆ తరువాత హిందీ సినిమాలో వరుసగా అవకాశాలు రావడంతో మురళీశర్మ బిజీ అయ్యారు.మురళీశర్మ నటన బాగా నచ్చడంతో డైరెక్టర్ సురేందర్ రెడ్డి మురళీశర్మకు అతిథి సినిమాలో అవకాశం ఇచ్చారు.

Advertisement

ఆ సినిమాలో మురళీశర్మ నటనకు మంచిపేరే వచ్చినప్పటికీ సినిమా ఫ్లాప్ కావడంతో ఆయనకు అవకాశాలు రాలేదు.ఆ తర్వాత మురళీశర్మ నటించిన అధినాయకుడు ఫ్లాప్ కాగా ఎవడు, భలే భలే మగాడివోయ్, గోపాల గోపాల సినిమాలు మురళీశర్మకు మంచిపేరు తెచ్చిపెట్టాయి.

గతేడాది ప్రతిరోజూ పండగే సినిమాతో సక్సెస్ అందుకున్న మురళీశర్మకు ఈ సంవత్సరం సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలో రెండు బ్లాక్ బస్టర్ హిట్లు మురళీశర్మ ఖాతాలో చేరాయి.అల వైకుంఠపురములో సినిమా వరకు రోజుకు లక్షన్నర చొప్పున తీసుకున్న మురళీశర్మ వరుసగా మూడు సక్సెస్ లు రావడంతో ప్రస్తుతం రోజుకు రెండు లక్షల పాతిక వేలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

కరోనా, లాక్ డౌన్ వల్ల నిర్మాతలు హీరోహీరోయిన్లను, నటులను పారితోషికాలు తగ్గించుకోవాలని కోరుతుంటే మురళీశర్మ మాత్రం భిన్నంగా పారితోషికం పెంచడం గమనార్హం.

రేవంత్ రెడ్డి పై ఫైర్ అయిన యాంకర్ శ్యామల ... తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయంటూ?
Advertisement

తాజా వార్తలు