సూపర్ స్టార్ మహేష్( Mahesh ) రాజమౌళి ( Rajamouli )కాంబినేషన్ లో వస్తున్న సినిమా పై ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.ముఖ్యంగా ఆర్.
ఆర్.ఆర్ తో వరల్డ్ వైడ్ పాపులర్ అయిన రాజమౌళి ఆ సినిమా పాటతో ఆస్కార్ కూడా అందుకోగా ఇక నెక్స్ట్ ఆయన చేస్తున్న సినిమాపై ఇంటర్నేషనల్ లెవెల్ లో బజ్ క్రియేట్ అవుతుంది.ఈ క్రమంలో SSMB 29 సినిమా విషయంలో ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు ఏర్పరచుకున్నారు.
ఇక ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ఒక న్యూస్ వైరల్ అవుతుంది.సినిమాను సీక్వెన్స్ ప్లానింగ్ ఉందని ఇదివరకే తెలియగా లేటెస్ట్ గా ఈ సినిమా ఒకటి రెండు పార్ట్ లు కాదు 3 పార్టులుగా ఉంటుందని అంటున్నారు.మహేష్ 29 సినిమా ఒక అడ్వెంచర్ మూవీగా రాబోతుంది.
సినిమా తప్పకుండా ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందించేలా ఉంటుందని చెప్పొచ్చు.ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు.
బడ్జెట్ ఎంత లాంటి విషయాలు త్వరలో తెలుస్తుంది.ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చేస్తున్న మహేష్ ఆ సినిమా పూర్తి చేసి రాజమౌళి సినిమాకు రెడీ అవనున్నాడు.
గుంటూరు కారం 2024 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు.