జంతువుల వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి.జంతువులు దాడి చేసుకునే వీడియోలు, ఒక జంతువు వేరే జంతువుపై దాడి చేసే చంపేసే వీడియోలు ట్రెండింగ్ అవుతుంటాయి.
తాజాగా అలాంటి ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.ఈ వీడియోలో ఒక కొంగను( Stork ) మొసలి వెంటాడబోయింది.
మొసలి( Crocodile ) ఆకలి తీర్చుకునేందు గాను కొంగను వెంటాడింది.ఒక కొంగ ఒడ్డున పచ్చికలో నిలబడి ఉండగా.
ఒక మొసలి నీటిలోనుంచి బయటకు వచ్చింది.మెల్లగా మొసలి పాకుకుంటూ వచ్చి కొంగ దగ్గరకు వచ్చింది.

ఈ సమయంలో కొంగ ఒక్కసారిగా వెనుకవైపు చూడగా పెద్ద మొసలి ఉంది.కొంగను మొసలి తినేందుకు ప్రయత్నాలు చేసింది.కొంగను తినేందుకు మొసలి ప్రయత్నిస్తుండగా.వెనక నుంచి మరొక పెద్ద మొసలి కొంగను తినేందుకు ప్రయత్నిస్తున్న మొసలిపై దాడి చేసింది.మొసలిని పెద్ద మొసలి తినేసింది.కొంగను తినేయాలని ప్రయత్నించిన మొసలిని మరో పెద్ద మొసలి తినేయడంతో కొంగ సురక్షితంగా బయటపడింది.
దీనికి సంబంధించిన వీడియోను పిషింగ్ గనానమస్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశాడు.

ఈ వీడియో అందరినీ షాక్ కు గురి చేస్తోంది.దేవుడి స్క్రిఫ్ట్ అంటే ఇలా ఉంటుందని, కొంగను తినాలని ప్రయత్నించిన మొసలిని మరో పెద్ద మొసలి తినేయడం చూస్తుంటే కొంగ పట్ల మొసలికి ఉన్న ప్రేమ తెలుస్తుందని అంటున్నారు.కొంగలు, మొసళ్లు వంద సంవత్సరాల నుంచి స్నేహితులుగా ఉంటాయని, అందుకే కొంగను మొసలి కాపాడిందని కొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదంతా దేవుడి సెటప్‌లా ఉందని మరికొంతమంది అంటున్నారు.మొసలి ఒకటి అనుకుంటే.మరొకటి జరిగిందని మరికొందరు కామెంట్ చేస్తోన్నారు.ఈ వీడియో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది.







