అల్లు అర్జున్ ( Allu Arjun )హీరోగా త్రివిక్రమ్ ( Trivikram Srinivas ) కాంబినేషన్ లో ఇప్పటి వరకు జులాయి.( Julayi )సన్నాఫ్ సత్యమూర్తి మరియు జులాయి సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే.మూడు సినిమా ల ఫలితాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆ మూడు సినిమా లు కూడా బన్నీ స్థాయి అమాంతం పెంచాయి.ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ కు ఈ జోడీ సిద్ధం అయ్యింది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క కథ సోషియో ఫాంటసీ అంటున్నారు.
సినిమా ను అధికారికంగా ప్రకటించారు.అంతే కాకుండా ఒక మంచి వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది.

దాంతో సినిమా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా త్రివిక్రమ్ ఈ సినిమా ను ఓ భారీ సినిమా గా రూపొందించబోతున్నాడట.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇది ఒక రియల్ పాన్ ఇండియా మూవీగా నిలవడం ఖాయం అంటున్నారు.కేజీఎఫ్.ఆర్‌ఆర్ఆర్ మాదిరిగా పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులతో పాటు ప్రతి ఒక్కరు కూడా నోరు వెళ్లబెట్టే రేంజ్ లో వీరి కాంబో మూవీ ఉంటుంది అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న సినిమా కథ చాలా స్పెషల్ గా ఉంటుందని మేకర్స్ అంటున్నారు.
ఇప్పటి వరకు త్రివిక్రమ్ చేసిన సినిమా లు తెలుగు రాష్ట్రాల వరకే పరిమితం అయ్యాయి.

మొదటి సారి పాన్ ఇండియా సినిమాకు సిద్ధం అవుతున్నాడు.త్రివిక్రమ్ వంటి స్టార్ డైరెక్టర్ పాన్ ఇండియా కు వెళ్లాలి అంటే చిన్నా చితకా సినిమా లు కథ లతో ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి చూపించక పోవచ్చు.కనుక బన్నీ కోసం తయారు చేసిన కథ కేజీఎఫ్ రేంజ్ లో యాక్షన్ ఉండాలి… కాంతార రేంజ్ లో డ్రామా ఉండాలి అంటూ అభిమానులు కోరుకుంటున్నారు.
మొత్తానికి రియల్ పాన్ ఇండియా మూవీ గా వీరి కాంబో నిలిచే అవకాశాలు ఉన్నాయి అంటూ యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు.







