విశాఖ TNSF అధ్యక్షులు ఎస్.రతన్ కాంత్ ఆధ్వర్యంలో ఎస్.
ఎస్.సి.పరీక్ష ఫతాలు సరిగా వ్యాలివేషన్ చేయనందుకు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు SSC ఫలితాల్లో విద్యార్థుల పరీక్ష పత్రాలు సరిగా వ్యాలివేషన్ చేయకపోవడంతో, రెండు లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారు.ఫెయిల్ అయిన కారణంగా అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఇవి కేవలం ప్రభుత్వ హత్యలే అన్నారు దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం పరీక్ష ఫలితాలను సరిగా వెల్లడించక పోవడంతో విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే ప్రధాన కారణమని రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రంశెట్టి కార్తీక్, నియోజకవర్గ అధ్యక్షులు డెక్క ఈశ్వర్, బోండా రవికుమార్, గొలగని కిషోర్, TNSF సభ్యులు బచ్చా ప్రవీణ్, మొహమ్మద్ అస్సలాం, దుర్గాప్రసాద్, కిరణ్ కుమార్, దినేష్, తదితరులు పాల్గొన్నారు.