కమల్ హాసన్ లీడ్ రోల్ లో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కలిసి నటించిన మూవీ విక్రం.కోలీవుడ్ స్టార్ డైరక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది.
ఈ సినిమాతో మరోసారి లోకనాయకుడు కమల్ హాసన్ తన సత్తా చాటుకున్నారు.సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
విక్రం సినిమాను తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి రిలీజ్ చేశారు.అంతకుముందు కమల్ సినిమాలేవి పెద్దగా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు ఇవ్వని కారణంతో విక్రం సినిమాను కేవలం 6 కోట్లకే అమ్మేశారు.
తెలుగులో కూడా విక్రం సినిమాకు హిట్ టాక్ వచ్చింది.ఓ పక్క మేజర్ సత్తా చాటుతున్నా సరే విక్రం కూడా కలక్షన్స్ రాబడుతుంది.ఫస్ట్ వీకెండ్ లోనే నితిన్ పెట్టిన మొంత్తం రాబట్టిందని తెలుస్తుంది.సోమవారం నుండి ఎంత కలక్షన్స్ వచ్చినా అది లాభాలే అని అంటున్నారు.
మొత్తానికి కమల్ విక్రం సినిమా వల్ల నితిన్ లాభ పడుతున్నాడు అన్నది మాత్రం నిజం. ఇక నితిన్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నితిన్ మాచర్ల నియోజక వర్గం సినిమా చేస్తున్నాడు.







