యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి దశాబ్ద కాలం పూర్తి కావస్తుంది.ఈ అమ్మడు హీరోయిన్ గా ప్రస్తుతం పలు భాషల్లో స్టార్ గా దూసుకు పోతుంది.
మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ గా అనిపించుకున్న శృతి హాసన్ నటి గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా సింగర్గా మ్యూజీషియన్ గా ఇంకా పలు రంగాల్లో కూడా తన ప్రతిభ ను చాటుకుంది.ఆ మధ్య సినిమాలకు గుడ్బై చెప్పాలని భావిస్తున్నట్లుగా ఈ అమ్మడు ప్రకటించింది.
ఆ సమయం లో చాలా మంది అభిమానులు నిరసన వ్యక్తం చేశారు.తనకు మ్యూజిక్ అంటే ఇష్టం కనుక మ్యూజిక్ పెట్టాలనే ఉద్దేశంతో సినిమా లకు దూరం గా ఉండాలని నిర్ణయించుకున్నట్లు గా ఆమె ప్రకటించింది.
కానీ తాజాగా ఆమె ప్రకటన పక్కకు పెట్టి వరుసగా సినిమాల్లో నటిస్తుంది.
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రూపొందుతున్న సినిమాతో పాటు ప్రభాస్ తో ఇప్పటికే సలార్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో శ్రుతిహాసన్ ఆధ్య అనే ఒక సింపుల్ అండ్ స్వీట్ గర్ల్ పాత్రలో కనిపించబోతుంది.ప్రభాస్ మరియు శృతి హాసన్ ల కాంబో ఎలా ఉంటుందో అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రభాస్ హైట్ కి సరిజోడు అన్నట్లుగా శృతిహాసన్ ఉంటుంది కనుక ఈ ఇద్దరి రొమాన్స్ పీక్స్ లో ఉంటుంది అని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

ఇండస్ట్రీ వర్గాల వారు కూడా శృతి హాసన్ తో ప్రభాస్ రొమాన్స్ చేయబోతున్న నేపథ్యంలో ఆసక్తిగా ఉన్నట్లుగా చెబుతున్నారు.తప్పకుండా ఈ సినిమా బాగుంటుందని అంటున్నారు.కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది.
ఇప్పటికే సినిమా విడుదలవ్వాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతుంది.షూటింగు ఇంకా బ్యాలెన్స్ ఉండటం వల్ల విడుదల ఎప్పుడనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.