ఆ నలుగురి భేటీ బిజెపి- టిడిపి పోత్తుకోసమేనా?

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రతి కలయికను రాజకీయ కోణంలోనే చూస్తున్నారు.గుంటూరులో జరిగిన ఒక భేటీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

 Srunjana Chowdary Trying To Make Tdp Bjp Alliance Happen , Sujana Chaudhary , C-TeluguStop.com

బిజెపి ( BJP )నేత సుజనా చౌదరి( Sujana Chaudhary) గుంటూరులో ఆలపాటి, కన్నా లక్ష్మీనారాయణ ,నక్క ఆనంద్ బాబుతో భేటీ అవ్వటం రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తుంది.సృజనా చౌదరి బిజెపి నేతగా మారి చాలా రోజులైనప్పటికీ ఆయనకు చంద్రబాబు( Chandrababu )తో ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయని, అసలు చంద్రబాబు సూచనతోనే ఆయన బిజెపిలో చేరారని టిడిపి పార్టీకి కేంద్రం లో ఉండే అవసరాలను బిజెపిలో చక్కబెట్టడానికి ఆయన అక్కడ ఉన్నారంటూ కొంతమంది అంటూ ఉంటారు.

ఇప్పుడు టిడిపి బిజెపి కలయిక గెలుపుకు అత్యవసరమని భావిస్తున్న ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ను ఒప్పించే బాధ్యతను సృజనకి అప్పజెప్పిందని ఇప్పుడు దానిలో భాగంగానే ఆయన ఈ పొలిటికల్ మీటింగ్లు మొదలు పెట్టారని వార్తలు వస్తున్నాయి.

Telugu Alapati, Chandrababu-Latest News - Telugu

తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడిన సృజన ఈ భేటీకి రాజకీయ ఉద్దేశాలు ఏమీ లేవని ఆలపాటితో ఉన్న స్నేహబంధంతోనే ఆయన ఆహ్వానం మేరకు కమ్మ హాస్టల్ వందేళ్ళ ఉత్సవానికి హాజరయ్యానని అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనుంచి వైసిపిని తరిమేస్తేనే రాష్ట్రానికి మంచి రోజులు ఉంటాయని ,,ప్రతిపక్షాలపై దాడులు చేయటం వైసిపి మానుకోకపోతే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు అంటూ ఆయన హెచ్చరించారు.ఆలపాటి మాట్లాడుతూ మాట్లాడుతూ తనకు సృజనతో మంచి సంబంధాలు ఉన్నాయని ఎన్నారై మెడికల్ కాలేజీ విషయంలో ఆయన సూచనలు మాకు ఎంతగానో ఉపయోగపడ్డాయని ఆ అభిమానంతోనే కమ్మ హాస్టల్ వందేళ్ల ఉత్సవానికి ఆయనను పిలిచానని అంతకుమించి రాజకీయ చర్చలు ఏమైనా జరగలేదని చెప్పుకొచ్చారు.

Telugu Alapati, Chandrababu-Latest News - Telugu

పైకి ఎన్ని చెప్తునప్పటికి వీరి బేటీ రాజకేయకోణం లోనే ఉందని ,ఈ భేటీ వెనక రాజకీయ చర్చలు జరిగాయని ఇటీవల పార్టీ నుంచి బయటికి వెళ్లిన కన్నా లక్ష్మీనారాయణ కూడా ఈ బేటీ లో ఉండటం వెనక టిడిపి బిజెపి పొత్తు దిశగా పరిణామాలు చర్చించుకున్నారని సమాచారం.వైసిపి అధిష్టానం కూడా ఈ బేటీ పై దృష్టి పెట్టిందని జరుగుతున్న పరిణామాలను నిశితం గా గమనిస్తుందని అంటున్నారు….ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున కీలక నాయకులందరూ తమ వ్యూహాలకు పదును పెట్టినట్లుగా తెలుస్తుంది ఇక రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు శర వేగం గా మారనున్నట్లు అర్థమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube