శ్రియ శరన్ ప్రధాన పాత్రలో నటించిన గమనం సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.ఈ సినిమా డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
థియేటర్ల ద్వారా విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.కానీ కమర్షియల్గా మాత్రం పెద్దగా సక్సెస్ రాలేదు.
విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న గమనం సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో టాప్ లో ట్రెండ్ అవుతుంది.ఇండియా లో అమెజాన్ ప్రైమ్ వీడియో వినియోగ దారులు అత్యధికంగా గమనం సినిమా ను చూస్తున్నట్లుగా ఒక ప్రకటన లో అమెజాన్ స్వయంగా ప్రకటించింది.
పుష్ప సినిమా తర్వాత అత్యధికం గా ప్రేక్షకులు చూస్తున్న సినిమాగా గమనం ఉందంటూ టాక్ వినిపిస్తోంది.

శ్రియ ప్రధాన పాత్ర లో నటించిన ఈ సినిమా కు సుజన రావు దర్శకత్వం వహించారు.ఈ సినిమా మూడు కథల ఆధారంగా నడుస్తుంది.మూడు విభిన్నమైన ఈ కథలు ఒక దానితో ఒకటి సంబంధం లేకుండా నడుస్తూ ఉంటాయి.
అయితే ఈ మూడు కథలకు కూడా హైదరాబాదు లో వచ్చిన కుంభ వృష్టి వర్షం కారణంగా విషాదమైన ఎండింగ్ లభిస్తుంది.ఆ ఎండింగ్ ఏంటి అనేది సినిమా కథ.ఈ సినిమా లో శ్రియ నటన అద్భుతం .చెవిటి తల్లి పాత్ర లో ఆమె కనిపించింది.భర్త మోసం చేసి దుబాయి వెళ్ళిపోతే టైలరింగ్ చేస్తూ బిడ్డని పెంచుకుంటూ ఉంటుంది.అలాంటి తల్లి పాత్ర లో నటించడం అంటే మామూలు విషయం కాదు.అద్భుతమైన నటన తో శ్రియ ఆకట్టుకుంది.అవార్డు విన్నింగ్ అనడం లో ఎలాంటి సందేహం లేదు.
అంగ వైకల్యం ఉన్న పాత్రల్లో నటించడం అంటే మామూలు విషయం కాదు.ఆ విషయంలో శ్రియాకు వందకు వంద మార్కులు పడ్డాయి అనడంలో సందేహం అసలే లేదు.
ఈ సినిమా తో ఆమె స్థాయి మరింతగా పెరిగినట్లు అయిందంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.అమెజాన్ లో ప్రస్తుతం గమనం సినిమా టాప్ లో ట్రెండింగ్ అవుతుండడంతో మరింత మంది చూస్తున్నారు.
తెలుగుతో పాటు ఇతర సౌతిండియా భాషల్లో మరియు హిందీలో కూడా గమనం స్ట్రీమింగ్ అవుతోంది.