స్వామి అమ్మవార్ల దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు పూలమాలవేసి ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.
దర్శన అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేదశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.విలేకరులతో మాట్లాడుతూ వచ్చే సంవత్సరం మార్చి బడ్జెట్ సమావేశాల్లో 3 రాజధానుల సవరణ బిల్లును ప్రవేశ పెడతామన్నారు.
చంద్రబాబు చేసేవన్నీ డ్రామాలేఅని ఆ డ్రామాలు చూసి నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు.లోకేష్ ఒక పనికిరాని పప్పు అని టీడీపీ బట్ట కట్టాలంటే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు రావాల్సిందేనని ఆయన అన్నారు.
టీడీపీ పరిపాలన లో ఉన్నప్పుడు 70 వేల కోట్ల అప్పు ని విద్యుత్ శాఖలో చేసి ప్రజలపై భారం వేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని త్వరలోనే గాడిలో పెడతామని ఉద్యోగులు ఆందోళన చెందనవసరం లేదని పీఆర్సీని అమలు పరిచే చర్యలు త్వరలోనే చేపడతామని బాలినేని తెలిపారు.