ప్రతి వారం లాగే ఈ వారం కూడా థియేటర్లలోకి విడుదల అవ్వడానికి సినిమాలు రెడీగా ఉన్నాయి.మరి ఈ వారం ఏఏ సినిమాలు విడుదల కానున్నాయి అన్న విషయానికి వస్తే.
నారా రోహిత్ హీరోగా నటించిన చిత్రం ప్రతినిధి 2.( Prathinidhi 2 ) గతంలో విడుదల అయిన ప్రతినిధి మూవీకి కొనసాగింపుగా రూపొందిన ఈ సినిమాని కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, సురేంద్రనాథ్ బొల్లినేని సంయుక్తంగా నిర్మించారు.ఈ మూవీ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.హరి డైరెక్షన్ లో విశాల్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన తాజా చిత్రం రత్నం.( Rathnam Movie )
కార్తికేయన్ సంతానం నిర్మాత.తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఆయుష్ శర్మ, సుశ్రీ మిశ్రా కీలక పాత్రల్లో కరణ్.బి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఫిల్మ్ రుస్లాన్.( Ruslaan ) శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు.జగపతిబాబు కీలక పాత్రలో నటించారు.
అయితే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇకపోతే ఈ వారం ఓటీటీలో( OTT ) వచ్చే చిత్రాలు/సిరీస్‌ల విషయానికి వస్తే.
ఈ వారం నెట్‌ఫ్లిక్స్ లో డెడ్ బాయ్ డిటెక్టివ్స్( Dead Boy Detectives ) అనే వెబ్‌సిరీస్ ఏప్రిల్ 25 న విడుదల కానుంది.
అలాగే టిల్లు స్క్వేర్( Tillu Square ) అనే తెలుగు మూవీ ఏప్రిల్ 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది.ఇక అమెజాన్ ప్రైమ్ లో దిల్ దోస్తీ డైలమా అనే హిందీ మూవీ ఏప్రిల్ 25 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.ఇకపోతే బుక్ మై షో లో కుంగ్‌ఫూ పాండా 4 యానిమేషన్ ఏప్రిల్ 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఇక డిస్నీ భీమా ( Bhimaa ) అనే తెలుగు మూవీ ఏప్రిల్ 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది.క్రాక్ హిందీ ఏప్రిల్ 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే ( Telugu OTT Movies Week Release List )
Movie Name | Release Date | Online Streaming Partner |
---|---|---|
డెడ్ బాయ్ డిటెక్టివ్స్ | ఏప్రిల్ 25 | నెట్‌ఫ్లిక్స్ |
టిల్లు స్క్వేర్ | ఏప్రిల్ 26 | నెట్‌ఫ్లిక్స్ |
దిల్ దోస్తీ డైలమా | ఏప్రిల్ 25 | అమెజాన్ ప్రైమ్ |
కుంగ్‌ఫూ పాండా 4 | ఏప్రిల్ 26 | బుక్ మై షో |
భీమా | ఏప్రిల్ 25 | డిస్నీ |
క్రాక్( హిందీ ) | ఏప్రిల్ 26 | డిస్నీ |