అసెంబ్లీ సమావేశాలంటేనే ప్రతిపక్షాలు, అధికార పార్టీ వర్గాల మధ్య నెలకొనే రచ్చ అంతా ఇంతా కాదు.ఒకరిపై ఒకరు విరుచుకుపడడం, మాటల యుద్ధానికి దిగడం పరిపాటి.
ఒకొనొక సమయంలో పోడియం వద్దకు వెళ్లి మైక్ లాక్కోవడం, టేబుల్స్ జరపడం లాంటివి చోటుచేసుకుంటాయి.ఇలాంటివి గతంలోనూ జరిగిన ఘటనలూ లేకపోలేదు.
తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాల్లోనూ అలాంటి పరిస్థితి రాకూడదనే భావనతో ఓ నిర్ణయం తీసుకున్నారు.ఎవరైనాసరే సభ్యులు కార్యకలాపాలకు అడ్డుపడినా.
వాగ్వివాదానికి దిగినా కట్టడి చేసేందుకు రూల్ తీసుకొచ్చారు.ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే సస్పెండ్ చేస్తామని రూల్ తీసుకొచ్చారు.
మంగళవారం అసెంబ్లీ సమావేశాలు హూందాగా సాఫీగా సాగేందుకు గడికోట శ్రీకాంత్ రెడ్డి ఈ రూల్ తీసుకొచ్చారు.కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నరన్న నెపంతో శాసనసభా వ్యవహరాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సభ్యుల సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రశేపెట్టారు.
ఇకపై ఎవరైనా నిబంధలు అతిక్రమిస్తే వేటు తప్పదని హెచ్చరికలు జారీ చేయడం విశేషం.
ఇక పోడియం ముందు తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు లైన్‌ను ఎర్పాటు చేశారు.
ఎవరైనా సభ్యులు ఎరుపులైన్ దాటితే ఆటోమేటిక్‌గా సస్పెండ్ అయ్యేలా రూల్ తీసుకొచ్చారు.దీనికి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే సభనుంచి పంపించేలా రూల్‌ను స్పీకర్ తమ్మినేని ఆమోదించారు.
జంగారెడ్డిగూడెం ఘటన విషయమై టీడీపీ సభ్యులు ఆందోళన చేసిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.అలాగే సభకు అడ్డుపడిన 11మంది టీడీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి ఒక్క రోజు సస్పెండ్ చేశారు.
కాగా ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రం సభ నుంచి బయటకు వెళ్లిపోకుండా అక్కడే నిరసన తెలిపారు.చివరకి మార్షల్స్‌తో వారిని బయటకు పంపించారు.
మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం విధితమే.అలాగే 14న కూడా ఐదుగురిపై బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు వేటు వేశారు.
మరి కొత్త రూల్‌తో సభ సాఫీగా జరుగుతుందా ? లేక కొత్త వాదనలేమైనా తలెత్తుతాయో చూడాలి.