శ్రీశైలం ప్రాజెక్టు ఎవరబ్బ జాగీరు..?: కేసీఆర్

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మార్పు రావాలనే ఎంపీగా పోటీ చేశానని తెలిపారు.

మహబూబ్ నగర్ ఎంపీగా ఉండి తెలంగాణ రాష్ట్రం సాధించానని కేసీఆర్ పేర్కొన్నారు.కృష్ణా నది పక్కనుంచే పారుతున్నా గతంలో జిల్లా పరిస్థితి మారలేదన్నారు.

కృష్ణా జలాల్లో మన హక్కులు మనకు దక్కాలని పోరాటం చేశామని తెలిపారు.జూరాల నుంచే నీళ్లు తీసుకోవాలని ఆంధ్ర సీఎంలు కుట్రలు చేశారన్నారు.

శ్రీశైలం ప్రాజెక్టు ఎవరబ్బ జాగీరన్న కేసీఆర్ మన పైసలు లేవా అని ప్రశ్నించారు.పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలానికి మార్చామని చెప్పారు.

Advertisement

అయితే ఇప్పటికీ జూరాల నుంచే నీళ్లు తీసుకోవాలని కొందరంటున్నారని తెలిపారు.జూరాల చిన్న ప్రాజెక్టు అని, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును నింపేందుకు జూరాల నీళ్లు సరిపోవని వెల్లడించారు.3, 4 నెలల్లో పాలమూరు ఎత్తిపోతల పారుతుందని స్పష్టం చేశారు.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
Advertisement

తాజా వార్తలు