ఎట్టకేలకు హీరో దొరికాడోచ్!

ఒకప్పుడు టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ సినిమాలకు కేరాఫ్‌గా మారి వరుసబెట్టి సినిమాలు చేసిన దర్శకుడు శ్రీను వైట్ల.

స్టార్ హీరోలు మొదలుకొని చిన్న హీరోల వరకు సినిమాలు చేసి హిట్ అందుకున్న ఈ డైరెక్టర్, ఆగడు సినిమా తరువాత ఆగమైపోయాడు.

ఇక ఆ సినిమా తరువాత చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలవడంతో, ఇప్పడు శ్రీను వైట్లతో సినిమా అంటేనే హీరోలు భయపడుతున్నారు.ఇక ఆయన కెరీర్‌లో మంచి విజయాన్ని అందించిన మూవీ ‘ఢీ’కు రీమేక్ ఖచ్చితంగా ఉంటుందని ఎప్పుడో ప్రకటించిన శ్రీను వైట్ల, ఇప్పుడు ఆ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.

అయితే ఈ సినిమాలో హీరో కోసం గతకొంత కాలంగా వెతుకుతున్నాడు.కానీ ఎవరూ కూడా వైట్లకు ఓకే చెప్పలేదు.

దీంతో ఢీ చిత్రంలో నటించిన మంచు విష్ణుకు ఢీ సీక్వెల్ మూవీకి సంబంధించిన కథను వైట్ల వినిపించాడట.కాగా కథ నచ్చిన మంచు విష్ణు ఢీ సీక్వెల్ చేసేందుకు ఓకే చెప్పాడట.

Advertisement

ఇక దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా త్వరలో రానున్నట్లు తెలుస్తోంది.మరి మంచు విష్ణుతోనైనా శ్రీను వైట్ల సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

మద్యం తాగి ఇంటికి వెళ్లిన ఏఎన్నార్.. భార్య అన్నపూర్ణ ఏం చేశారంటే..?
Advertisement

తాజా వార్తలు