మహేష్ బాబుతో ఆ సినిమా చేసి తప్పు చేశాను.. శ్రీనువైట్ల సంచలన వ్యాఖ్యలు!

దర్శకుడు శ్రీనువైట్ల( Director Srinuvaitla ) గురించి మనందరికీ తెలిసిందే.ఈయన పేరు వినగానే ముందుగా ఢీ,రెడీ,దూకుడు ఇలాంటి సినిమాలు గుర్తుకు వస్తూ ఉంటాయి.

ఈ సినిమాలు విడుదల అయ్యి అప్పట్లో ఎంతటి విజయాన్ని సాధించాయో మనందరికీ తెలిసిందే.కామెడీ విషయంలో సరికొత్త ట్రెండ్ చేసిన ఈయన ఆ తర్వాత సరైన మూవీస్ చేయక పూర్తిగా వెనకబడిపోయారు.

రవితేజతో తీసిన అమర్ అక్బర్ ఆంటోని( Amar Akbar Antony ) ఘోరమైన డిజాస్టర్ కావడంతో కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమయ్యాడు.చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు విశ్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

టాలీవుడ్ హీరో గోపీచంద్( Tollywood hero Gopichand ) హీరోగా నటించిన ఈ సినిమా అక్టోబరు 11న దసరా పండుగ కానుకగా థియేటర్లలోకి రానుంది.ఈ సందర్భంగా ప్రమోషన్లలో కాస్త బిజీగా ఉన్న దర్శకుడు శ్రీనువైట్ల.పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు.

Advertisement

అలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.మహేశ్ బాబు ఆగడు ఫ్లాప్‌పై స్పందించారు.

ఆ మూవీ చేసినందుకు ఇప్పటికీ బాధపడుతుంటానని అన్నారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.

ఆగడు తీసినందుకు జీవితాంతం బాధపడుతూనే ఉంటాను.దానికి ఒక కారణం ఉంది.

దూకుడు లాంటి బ్లాక్‌ బస్టర్ తర్వాత మహేశ్ బాబుతో భారీ బడ్జెట్ సినిమా చేయాలనుకున్నాను.అప్పుడు ఆగడు మూవీ చేయాలనే ఆలోచనే లేదు.

దారుణం.. మురికి కాలువ నీటితో కూరగాయలు కడుగుతున్న వ్యాపారి... వీడియో చూస్తే గుండెలు గుభేల్!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి3, సోమవారం 2025

భారీ యాక్షన్ స్టోరీ కూడా మహేశ్‌ కి చెప్పాను.సూపర్ చేసేద్దామని అన్నారు.14 రీల్స్ సంస్థ ( 14 reels organization )నిర్మాతలకు కూడా కథ నచ్చింది.కానీ వాళ్లంత బడ్జెట్ పెట్టలేమని అన‍్నారు.

Advertisement

అప్పట్లో వాళ్లకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి.దీంతో ఆ కథని పక్కనబెట్టి ఆగడు చేశాం.

అయితే అది చేయకుండా ఉండాల్సిందని ఇప్పటికీ బాధపడుతుంటాను అని శ్రీనువైట్ల చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా ఆయన చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాలి.

తాజా వార్తలు