తప్పు ఒప్పుకున్న దర్శకుడు

ప్రస్తుతం టాలీవుడ్‌ హిట్‌ చిత్రాల జాబితాలో మొదట ‘బాహుబలి’ ఉండగా, రెండవ స్థానంలో ‘శ్రీమంతుడు’ చిత్రం ఉంది.

మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడు చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది.

ఈ చిత్రంతో దర్శకుడు కొరటాల శివ ఒక్కసారిగా భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు.పలు సంచలనాలకు కేంద్ర బింధువు అయిన ‘శ్రీమంతుడు’ చిత్రం కథ కాపీ అంటూ సినిమా విడుదలకు ముందు నుండే ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే.

అయితే తాజాగా అసలు కథకు సంబంధించిన వ్యక్తి కోర్టులో కేసును ఫైల్‌ చేశాడు.దాంతో తప్పని పరిస్థితుల్లో చిత్ర యూనిట్‌ సభ్యులు తల వంచక తప్పలేదు.

టాలీవుడ్‌ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం కథను తాను ‘చచ్చేంత ప్రేమ’ అనే బుక్‌ నుండి తీసుకున్నట్లుగా దర్శకుడు కొరటాల శివ ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.అసలు కథను రాసిన శరత్‌ చంద్ర అనే వ్యక్తితో చిత్ర యూనిట్‌ సభ్యులు కాంప్రమైజ్‌ అవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

అందుకోసం నిర్మాతలు 10 లక్షలు మరియు దర్శకుడు 5 లక్షలు ఇవ్వనున్నట్లుగా సమాచారం అందుతోంది.ఈ వివాదాన్ని మరింత పెద్దగా చేయాలనుకోవడం లేదని నిర్మాతలు అంటున్నారు.

మరి శరత్‌ చంద్ర రాజీకి ఒప్పుకుంటాడా అనేది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా ఉంది.

వయస్సు 93 , 107 మంది భార్యలు... 185 మంది సంతానం... ఆయన అంతమందిని పెళ్లి ఎందుకు చేసుకున్నాడో తెలుసా
Advertisement

తాజా వార్తలు