‘శ్రీమంతుడు’ : 10 టికెట్ల ఖరీదు 10 లక్షలు

టాలీవుడ్‌లో మొన్నటి వరకు ‘బాహుబలి’ ఫీవర్‌ నడిచింది.అది కాస్త తగ్గిన వెంటనే ‘శ్రీమంతుడు’ ఫీవర్‌ మొదలైంది.

ఎక్కడ చూసినా కూడా సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ‘శ్రీమంతుడు’ చర్చ జరుగుతోంది.భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు.

ఈయన మొదటి సినిమా ‘మిర్చి’ సూపర్‌ హిట్‌ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు మొదటి నుండి కూడా తారా స్థాయిలో ఉన్నాయి.ఇక ఫస్ట్‌లుక్‌ టీజర్‌ వచ్చిన తర్వాత సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూడటం మొదలు పెట్టారు.

ఈనెల 7న ఈ సినిమాను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.భారీ స్థాయిలో ఈ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది.

Advertisement

దాంతో భారీ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయాలని డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్‌ చేస్తున్నారు.ఇక యూఎస్‌లోని ఒక థియేటర్‌లో ఈ సినిమా ప్రీమియర్‌ షో టికెట్ల రేట్లు దుమ్ము రేపుతున్నాయి.

మహేష్‌బాబు వీరాభిమాని డెట్రాయిట్‌లో మొదటి పది టికెట్లను ఏకంగా 15 వేల డాలర్లకు కొనుగోలు చేశాడు.అంటే దాదాపుగా పది లక్షలు అన్నమాట.

ఇంత భారీ స్థాయిలో టికెట్లకు ఓవర్సీస్‌లో క్రేజ్‌ ఉండటంతో పంపిణీదారులు ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు.గతంలో మహేష్‌బాబు నటించిన పలు సినిమాలో ఓవర్సీస్‌లో రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ను రాబట్టాయి.

ఈ సినిమా కూడా గత చిత్రాల కంటే ఎక్కువ రాబట్టడం ఖాయం అని ఫ్యాన్స్‌ మరియు నిర్మాతలు అంటున్నారు.

భూములపై చంద్రబాబు దుష్ప్రచారం.. సీఎం జగన్ ఫైర్
Advertisement

తాజా వార్తలు