శ్రీదేవి పెద్ద కూతురు ఝాన్వి సినిమాల్లో సెటిల్..! మరి చిన్న కూతురు ఖుషి ఏ రంగం ఎంచుకుంది.?

అమ్మ పంచిన ప్రేమ వారికి ఒక ‘జ్ఞాపకం’గా మిగిలిపోయింది.‘ఆమె’ ఇక లేదు! అని మనసుకు సర్దిచెప్పుకోవడం కష్టమే! శ్రీదేవి కుమార్తెలు జాన్వీ కపూర్‌, ఖుషీ కపూర్ల బాధ వర్ణనాతీతం.

 Sridevis Younger Daughter Khushi Kapoor To Enter Bollywood-TeluguStop.com

అమ్మ లేదన్న బాధను, ఆమె లేని జీవితాన్ని ఊహించుకోలేక కుంగిపోతున్నారు.కానీ ఆ బాధను దిగమింగి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీదేవి పెద్ద కూతురు ఝాన్వి.

ఆమె నటించిన ‘ధడక్‌’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకి వచ్చింది.పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతుంది.

తల్లి లాగే జాన్వీ కూడా కళ్లతోనే భావాలను పలికించగలదంటూ శ్రీదేవి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఇప్పుడు శ్రీదేవి చిన్న కూతురు ఖుషి గురించి సోషల్ మీడియాలో ఓ చర్చ వైరల్ అవుతుంది.అదేంటి అంటే.పెద్ద కూతురు సినీ రంగంలో సెటిల్ అయ్యింది.

మరి చిన్న కూతురు ఏం చేస్తుంది అని.ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

ఖుషీ కపూర్‌ కూడా సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇవ్వనుందని బోనీ కపూర్‌ ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు.“ఖుషీ మొదట మోడల్‌ కావాలనుకుంది.కానీ ప్రస్తుతం తన లక్ష్యం మారింది.అక్క జాన్వీ లాగే తను కూడా హీరోయిన్‌ కావాలనుకుంటోంది.కెరీర్‌ గురించి నిర్ణయం తీసుకోగల పరిపక్వత నా పిల్లలకు ఉంది.అన్షులా, అర్జున్‌, జాన్వీలు తమ సొంత నిర్ణయం మేరకే కెరీర్‌ను రూపొందించుకున్నారు.

ఇపుడు ఖుషీ కూడా వారి బాటలోనే నడవాలనుకుంటోందని” బోనీ కపూర్‌ చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube