నేనేం వ్యభిచారిని కాదు.. అసలు వ్యభిచారులు వారు!

తెలుగు సినిమా పరిశ్రమను దాదాపు మూడు నాలుగు నెలల పాటు ప్రశాంతంగా ఉండకుండా చేసిన శ్రీరెడ్డి ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమపై బాంబులు విసురుతుంది.తెలుగులో ఎంతో మందిపై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులపై తనదైన శైలిలో విరుచుకు పడుతుంది.

 Sri Reddy Is Doing That Business Sri Reddy Is To Be Arrested-TeluguStop.com

తమిళంకు చెందిన పలువురితో కూడా తాను పడుకున్నాను అని, అయినా కూడా తనకు ఆఫర్లు దక్కలేదు అంటూ చెప్పుకొచ్చింది.నాతో పడుకుని అవకాశాలు ఇస్తాం అని, ఇప్పిస్తాం అని చెప్పిన వారు మొహం చాటేశారు అంటూ పదే పదే చెప్పడంతో తమిళ సినీ పరిశ్రమ ప్రముఖులు శ్రీరెడ్డికి వ్యతిరేకంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు.

తాజాగా శ్రీరెడ్డిపై పోలీసు కేసు కూడా నమోదు అయ్యింది.వ్యభిచారం చేస్తున్నట్లుగా శ్రీరెడ్డి ఒప్పుకున్న కారణంగా ఆమెను వెంటనే అరెస్ట్‌ చేయాలని చెన్నై పోలీసులకు ఫిర్యాదు అందింది.

శ్రీరెడ్డిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు అంటూ కొన్ని తమిళ మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి.ఈ సమయంలోనే శ్రీరెడ్డి సోషల్‌ మీడియా లైవ్‌ ద్వారా తన అభిప్రాయాలను చెప్పుకొచ్చింది.

బయట ప్రచారం జరుగుతున్నట్లుగా తాను ఏమీ అరెస్ట్‌ కాలేదు అని, అసలు తాను వ్యభిచారిని ఎలా అవుతాను అంటూ శ్రీరెడ్డి ప్రశ్నించింది.

శ్రీరెడ్డి ఇంకా మాట్లాడుతూ.తనను వ్యభిచారం చేస్తున్నట్లుగా కొందరు ఆరోపిస్తున్నారు.నేనేం డబ్బులు తీసుకుని వారితో పడుకోలేదు.

నాతో పడుకున్న వారు అసలు నాకు కనీసం ఒక్క పూట అన్నం కూడా పెట్టలేదు అని చెప్పుకొచ్చింది.నాతో పడుకున్న ప్రతి ఒక్కరు నన్ను వాడుకుని వదిలేశారు తప్ప నాకు ఎలాంటి సాయం చేయలేదు.

అలాంటప్పుడు నేను ఎలా వ్యభిచారిని అవుతాను అంటూ ప్రశ్నించింది.నాతో పడుకున్న వారి గురించి మాట్లాడని జనాలు నా గురించి మాట్లాడటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది.

నాతో పడుకున్న హీరోలు, దర్శకులు వ్యభిచారులు అయితే అప్పుడు నేను కూడా వ్యభిచారిని అవుతాను అంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.తాను ఎంతో మంది చేతిలో మోసపోయాను, కాని నాపై కనీస జాలి చూపించకుండా అంతా నన్నే దోషి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు అంటూ శ్రీరెడ్డి ఆరోపించింది.

తనను వ్యభిచారి అంటూ దూషించే వారు మొదట వారి గురించి ఆలోచించుకోవాలి అని, తన బలహీనతను క్యాష్‌ చేసుకుని ఎంతో మంది నన్ను వాడుకున్నారు అంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube