తెలుగు లో బెస్ట్ లవ్ కపుల్ అంటే ప్రస్తుతం చాలా మంది “చైతన్య సమంత” అంటున్నారు.అందులో అతిశయోక్తి ఏం లేదు కదా.? ఈ జంటకి నెటిజన్స్ లో చాలా ఫోలివింగ్ ఉంది.వరుస ట్వీట్లు , ఇంస్టాగ్రామ్ పోస్టులతో ఫాన్స్ ని ఆకట్టుకుంటూ ఉంటారు.
అయితే ఇటీవల చైతన్యా ఒక బాచిలర్ పార్టీకి వెళ్ళారంట.అదేంటి బాచిలర్ పార్టీకి చైతన్య ఎలా వెళ్ళాడు అనుకుంటున్నారా.? అసలు కథ అక్కడేఉంది.వివరాలలోకి వెళ్తే.

సుశాంత్ ఈ పార్టీ ఇచ్చేది తన సినిమా ‘చి.ల.సౌ.’ ప్రమోషన్ కోసం.పెళ్లిని వాయిదా వేసుకోవడం కోసం మీరు ఏ కారణం చెప్పి తప్పించుకుంటున్నారో చెబితే చాలట.గెలిచిన వారికి రిలీజ్ కంటే ముందుగానే చిలసౌ సినిమా చూపిస్తారు.అంతే కాదు అమేజింగ్ పార్టీ ఇస్తారు.ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ ఐదు ప్రశ్నలకు బదులిస్తే సరిపోతుంది.
ఈ ప్రశ్నకు బదులిస్తూ పాపం చైతూ మాత్రం నాలో బ్యాచిలర్ ఇంకా బతికే ఉన్నాడని మనసులో మాట బయటపెట్టి.సమంత దగ్గర బుక్కైపోయాడు.పార్టీ కోసం ఆశపడి భార్యామణికి దొరికిపోయాడు.







