హిందీ బిగ్‌బాస్‌లో ఒక్కసారి ఛాన్స్ వచ్చిన వారికి స్టార్ ఇమేజ్ దక్కుతుంది.వారిలో చాలా మందికి బాలీవుడ్లో మంచి ఆఫర్లు వచ్చి లైఫ్ సెటిల్ అయ్యింది.
కాని తెలుగు బిగ్‌బాస్ సెలబ్రెటీలు మాత్రం పెద్దగా సినిమాల్లో ఆఫర్లు దక్కించుకోలేక పోతున్నారు.సినిమాల్లో ఆఫర్ల సంగతి ఏమో కాని కనీసం ఉన్న గుర్తింపును, స్థాయిని కూడా నిలబెట్టుకోలేక పోతున్నారు.
ఇటీవలే తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 పూర్తి అయ్యింది.ఆ సీజన్లో శ్రీముఖి విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు.
కాని ఆమె రన్నర్‌గా నిలిచి రాహుల్ విన్నర్ అయ్యాడు.

విన్నర్ అయిన రాహుల్‌కు రన్నర్ అయిన శ్రీముఖికి పెద్దగా ఛాన్స్‌లు వస్తున్నట్లుగా అనిపించడం లేదు.రాహుల్ కొన్ని పాటలు పాడే అవకాశాలు వస్తుండగా, శ్రీముఖి పరిస్థితి మాత్రం ఘోరం అంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.ఆమె పటాస్ షో ద్వారా మంచి గుర్తింపు దక్కించుకుంది.
కాని బిగ్‌బాస్ కోసం ఆమె పటాస్‌ను వదిలేసింది.పటాస్ షో నుండి బిగ్‌బాస్‌కు వెళ్లిన ఆమె ఇప్పుడు మాటీవీలో ఒక కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తుంది.
ఆ కార్యక్రమం ఇప్పటికే ఫ్లాప్ అయ్యింది.

శ్రీముఖి వచ్చినంత మాత్రాన సక్సెస్ అవుతుందని ఎవరు అనుకోవడం లేదు.ఆ షో తప్ప శ్రీముఖి చేతిలో మరే షో కూడా లేదు.పటాస్ చేస్తున్న సమయంలో ఆమె చాలా బిజీగా ఉండేది.
కాని ఇప్పుడు చాలా ఖాళీగా ఉంటున్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.శ్రీముఖి బిగ్‌బాస్‌పై మోజుతో వెళ్లి ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్లుగా అయ్యింది.
శ్రీముఖి ఇకపై అయినా మంచి నిర్ణయాలు తీసుకోవాలంటూ ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.