అఖిల్ ని భర్తగా కోరుకుంటున్న హాట్ యాంకర్... చేతిపై పచ్చబొట్టు కూడా

హీరోలని విపరీతంగా ఆరాధించే అమ్మాయిలు చాలా మంది ఉంటారు.కొంత మంది పిచ్చి పిచ్చిగా ప్రేమించేస్తూ ఉంటారు.

తన లైఫ్ లోకి అలాంటి వాడే భర్తగా రావాలని కొంత మంది అమ్మాయిలు కోరుకుంటే, కొంత మంది మాత్రం ఆ హీరోలని భర్తగా పొందాలని కలలుకంటూ ఉంటారు.అయితే అలా హీరోలని పెళ్లి చేసుకునే అదృష్టం అభిమానించే అమ్మాయిలకి చాలా అరుదుగా లభిస్తుంది.

ఇక సెలబ్రెటీలలో కూడా హీరోలని విపరీతంగా ప్రేమించేవాళ్ళు ఉంటారు.ఇందులో యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఈమెకి అక్కినేని వారసుడు అఖిల్ అంటే విపరీతమైన ఇష్టం.అది ఎంత ఇష్టం అంటే అవకాశం దొరికితే పెళ్లి చేసుకునేంత.

Advertisement

ఈ విషయాన్ని తాజాగా శ్రీముఖి రివీల్ చేసింది.ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.

శ్రీముఖి, విష్ణుప్రియ మంచి ఫ్రెండ్స్, ఈ మధ్య సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ వీరిద్దరూ కలిసి సందడి చేస్తున్నారు.తాజాగా ఝాన్సీ హోస్ట్ చేస్తున్న ఓ షోలో వీళ్ళు పాల్గొన్నారు.

ఇందులో భాగంగా విష్ణుప్రియకు సంబంధించి ఎవ్వరికీ తెలియని సీక్రెట్ ను రివీల్ చెయ్యాలని యాంకర్ ఝాన్సీ శ్రీముఖిని కోరింది.అంతే ఇక శ్రీముఖి అసలు విషయాన్ని బయటపెట్టేసింది.

హీరో అక్కినేని అఖిల్ అంటే యాంకర్ విష్ణుప్రియకు చాలా ఇష్టమని, ఎంత ఇష్టమంటే అతను ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనేంత అని చెప్పుకొచ్చింది.ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని విష్ణుప్రియను అడిగితే నాకు అఖిల్ తో పెళ్లి చెయ్యమని అడుగుతుందని తన చేతిపై అఖిల్ పేరుని టాటూగా వేయించుకుందని శ్రీముఖి చెప్పుకొచ్చింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!

ఈ విషయాన్ని బిగ్ బాస్3లో ఉన్నప్పుడు నాగార్జున గారికి చెబుదాం అనుకున్నాను కానీ కుదర్లేదు అని కూడా శ్రీముఖి తెలిపింది.మొత్తానికి విష్ణుప్రియకి అఖిల్ పై ఉన్న ప్రేమ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది.

Advertisement

తాజా వార్తలు