భగవంత్‌ కేసరి శ్రీ లీల కి ప్లస్‌ అయిందా? మైనస్‌ అయిందా?

నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) హీరో గా అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వం లో రూపొంది ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రతిష్ఠాత్మక చిత్రం భగవంత్‌ కేసరి.ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ప్రచారం చేశారు.

హీరోయిన్ గా స్టార్‌ డమ్‌ తో నెం.1 గా దూసుకు పోతున్న శ్రీలీల ను ఈ సినిమా లో కీలక పాత్ర లో దర్శకుడు చూపించాడు.బాలయ్య కి కూతురు వరుస అయ్యే పాత్ర ను శ్రీలీల చేయడం జరిగింది.

ఆర్మీ కోసం ట్రైనింగ్‌ చేయించి శ్రీ లీల( Sreeleela ) ను చాలా కష్టపెట్టాడు.అయినా కూడా ఆమె సాధ్యం అయినంత వరకు సత్తా చాటింది.అయితే సినిమా లో ఆమె నటనకు స్కోప్‌ దక్కింది కానీ హీరోయిన్‌ గా గ్లామర్‌ గా కనిపించి, డాన్స్‌ తో మెప్పించేందుకు స్కోప్‌ లేదు.

అక్కడ పాత్ర కు స్కిన్‌ షో చేయించడం సరి కాదు.అందుకే దర్శకుడు చూపించలేదు.అయితే శ్రీ లీల అభిమానులు మాత్రం భగవంత్‌ కేసరి సినిమా లో పూర్తి న్యాయం చేసినట్లుగా చెబుతున్నారు.

సినిమా లో హీరోయిన్‌ గా నటిస్తే బాగుంటుంది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్‌ మీడియాలో భగవంత్‌ కేసరి గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

Advertisement

అయితే శ్రీ లీల ( Sreeleela )గురించి మాత్రం కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో ఒప్పుకోవాల్సిన పాత్ర కాదు అన్నట్లుగా కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.చైల్డ్‌ ఆర్టిస్ట్‌ గా ఈ సినిమా లో శ్రీ లీల ని చూసినట్లుగా అనిపిస్తుంది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.భగవంత్‌ కేసరి సినిమా( Bhagavanth kesari movie ) లో మానసిక పరిస్థితి సరిగా లేని పాత్ర లో శ్రీ లీల నటించడం అభినందనీయం.

కానీ ఒక వైపు స్టార్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న సమయంలో ఇలాంటి పాత్ర లు చేయడం సరి కాదు అనేది చాలా మంది అభిప్రాయం.ఈ సినిమా శ్రీలీల కెరీర్ కి ప్లస్ అయితే కాదు.

అలా అని మైనస్‌ కూడా కాదు అనేది టాక్‌.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు