ఇంటర్నేషనల్ ఆఫర్ కొట్టేసిన శ్రీలీల.. లక్ అంటే ఇది కదా!

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల( Sreeleela ) గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు.ఒక్క సినిమాతో ఈమె స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయిందనే చెప్పాలి.

 Sreeleela Bags Another Biggie Details, Sreeleela, Chennai Story Movie, Ssmb28, M-TeluguStop.com

శ్రీలీల అందం, అభినయం అన్ని కూడా ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తాయి.పెళ్లి సందడి సినిమా( Pelli sandadi movie ) ద్వారా వెండి తెరమీద అడుగు పెట్టిన ఈ భామ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

శ్రీలీల వరుస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ లో దూసుకు పోతుంది.ఇక ధమాకా హిట్ తర్వాత అమ్మడికి స్టార్ హీరోల్లో కూడా అవకాశాలు వరిస్తున్నాయి.తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ్ భాషల్లో కూడా వరుస సినిమాలకు ఈమె సైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.అలాగే తాజాగా ఈ భామకు అంతర్జాతీయ సినిమాలో అవకాశం వచ్చింది అని టాక్.

ఇంటర్నేషనల్ సినిమా అంటే చెప్పాల్సిన పని లేదు.ఈమె ‘చెన్నై స్టోరీ’( Chennai Story ) అనే ఇంగ్లీష్ సినిమాలో నటించ బోతున్నట్టు టాక్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

మొన్నటి వరకు ఈ సినిమాలో సమంత పేరు వినిపించగా.ఇప్పుడు శ్రీలీల పేరు వినిపిస్తుంది.

మరి ఈ సినిమాలో నిజంగానే ఆఫర్ కొట్టేస్తే ఈ బ్యూటీ లక్ ఎక్కడికో వెళ్ళినట్టే.

ఈ సినిమాకు ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించ నుండగా ఇంగ్లాండ్ కు చెందిన వివేక్ కల్రా హీరోగా నటిస్తున్నాడు.ఇంగ్లాండ్ యువకుడికి చెన్నైకు చెందిన యువతికి మధ్య జరిగే ప్రేమ కథగా ఈ సినిమా ఉంటుందట.చూడాలి ఈ సినిమాలో చెన్నై భామగా ఎవరు కనిపిస్తారో.

ఇక ఈ బ్యూటీ తెలుగులో మహేష్ బాబుతో ఒక సినిమా, పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా, రామ్ పోతినేని తో ఒక సినిమా, విజయ్ దేవరకొండలో ఒక సినిమా చేస్తుంది.ఇలా చెప్పుకుంటే పోతే ఈమె లిస్ట్ చాలా పెద్దది అనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube