ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో వింతలను చూసినప్పుడు, విన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది.అసలు ఇది నిజమేనా అని అనిపించే ఎన్నో వింతలు జరుగుతున్నాయి.
రాయి మండితే ఇంటర్నెట్ సిగ్నల్( Internet Signal ) వస్తుంది అంటే ఎవరైనా నమ్ముతారా.? ఇది సాధ్యం కాదని అందరూ కొట్టి పారేస్తారు.ఇలాంటివి కళ్ళతో స్వయంగా చూస్తేనే నిజమని ఒప్పుకుంటాం.ఈ అద్భుతం జర్మనీలో( Germany ) చోటుచేసుకుంది.అసలు రాయిలో నుంచి ఇంటర్నెట్ ఎలా వస్తుందో తెలుసుకుందాం.
జర్మనీకి చెందిన ఎరామ్ బర్తోల్( Aram Bartholl ) అనే వ్యక్తి కాస్త వినూత్న ఆలోచించి రాయి మండితే ఇంటర్నెట్ సిగ్నల్ వచ్చే ఒక మ్యాజిక్ స్టోన్ తయారు చేశాడు.
ఈ రాయి లోపల థర్మల్ ఎలక్ట్రిక్ జనరేటర్ ను అమర్చాడు.ఎప్పుడైతే ఆ రాయికి వేడి తగులుతుందో అప్పుడు రాయికి తగిలిన వేడి విద్యుత్ శక్తిగా మారుతుంది.
తద్వారా వైఫై రూటర్( WiFi Router ) ఆన్ అవుతుంది.ఇక ఇంటర్నెట్, వైఫై సిగ్నల్స్ కు ఎటువంటి అంతరాయం ఉండదు.

సాధారణంగా ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ వాడకం అలవాటు అయిపోయింది.ల్యాబ్ టాప్ లేదా స్మార్ట్ ఫోన్లో ఏమైనా చేస్తున్నప్పుడు ఒక్కసారిగా ఇంటర్నెట్ సిగ్నల్స్ కట్ అయితే ఎంత చిరాకు తెప్పిస్తుందో అందరికీ తెలిసిందే.ఇక సిగ్నల్స్ కోసం ఇంటి పైకి ఎక్కడం, ఎత్తైన ప్రాంతాలకు వెళ్లడం లాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే.ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు ఇంటర్నెట్ సిగ్నల్స్ అనేవి ఉండవు.
ఈ విషయాలను దృష్టిలో పెట్టుకున్న ఎరామ్ బర్తోల్ ఇంటర్నెట్ సిగ్నల్స్ అంతరాయ సమస్యకు చెక్ పెట్టేశాడు.

ఈ మ్యాజిక్ స్టోన్( Magic Stone ) మామూలుగా ఒక కృత్రిమ రాయి.దీని బరువు ఒకటిన్నర టన్నులు ఉంటుంది.ఇక ఇంటర్నెట్ సిగ్నల్స్ కావాలంటే ఈ రాయికి మంట పెడితే చాలు.
ఈ రాయిని జర్మనీలో కీప్ అలైవ్ అనే పేరుతో పిలుస్తారు.ఈ అద్భుతాన్ని చూసేందుకు అక్కడి ప్రజలు ఎగబడుతూ ఉండడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.







