నిరంతరం విధి నిర్వహణలో బిజీగా ఉండే అధికారులు, సిబ్బందిలో క్రీడలు ఉల్లాసాన్ని ఉత్సాహన్ని నింపుతాయి.

మూడు రోజుల పాటు హోరాహోరిగా సాగిన సిరిసిల్ల పోలీస్ ప్రీమియం క్రికెట్ లీగ్.

ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో గెలుపొందిన డీజీ బ్రేవ్ సోల్జియర్స్( DG Brave Soldiers ).

రాజన్న సిరిసిల్ల జిల్లా: గురువారం రోజున స్థానిక కళాశాల మైదానంలో డీజీ బ్రేవ్ సోల్జియర్స్ ,సిరిసిల్ల స్ట్రైకర్స్ కి మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ కి ముక్య అతిధిగా హాజరైన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో గెలుపొందిన డీజీ బ్రేవ్ సోల్జియర్స్ టీమ్ సిరిసిల్ల స్ట్రైకర్స్ జట్టు పై విజయం సాధించింది.

డీజీ బ్రేవ్ సోల్జియర్స్ టీమ్ నిర్ణిత 12 ఓవర్లలో 74 పరుగులు చేసి అల్ ఔట్ కాగా సిరిసిల్ల స్ట్రైకర్స్ టీమ్ 12 ఓవర్లలో 74 పరుగులు చేయగా మ్యాచ్ డ్రా గా ముగిసింది.అనంతరం సూపర్ ఓవర్ లో డీజీ బ్రేవ్ సోల్జియర్స్ జట్టు 6 బంతుల్లో 14 పరుగులు చేయగా సిరిసిల్ల సోల్జియర్స్ టీమ్ కూడా 6 బంతుల్లో 14 పరుగులు చేసి డ్రా చేయగా టాస్ రూపంలో డీజీ బ్రేవ్ సోల్జియర్స్ టీమ్ ను విజేతగా నిర్ణయించారు.

జిల్లా ఎస్పీ విన్నర్ టీమ్‌ సభ్యులను, రన్నర్ టీం సభ్యులను, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్మెన్, లను అభినందించి బహమతులు ప్రధానం చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.

Advertisement

జిల్లాలో సర్కిల్ వారిగా, ఆర్ హెడ్ క్వార్టర్, అన్ని విభాగాలు కలుపుకొని 08 టీములు సిరిసిల్ల పోలీస్ ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్నాయన్నారు.ఆటలో గెలుపోటములు సహజం అని గేమ్ స్పిరిట్ తో క్రీడలు అడలన్నారు.

క్రీడలు మానసిక ఉల్లాసం గురించి, శరీర దృఢత్వం గురించి బాగా మేలు చేస్తాయని, సమయం దొరికినప్పుడల్లా సిబ్బంది, అధికారులు వ్యాయామం చేయాలని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.త్వరలో సిరిసిల్ల పోలీస్ ప్రీమియం లీగ్ సీజన్-01 నిర్వహించడం జరుగుతున్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య,డిఎస్పీ ఉదయ్ రెడ్డి,సి.ఐ లు రఘుపతి, అనిల్ కుమార్, శశిధర్ రెడ్డి, ఆర్.ఐ లు మధుకర్, యాదగిరి, రమేష్, ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News