వావ్, వాట్ ఏ టాలెంట్.. ఒకేసారి 5 బంతులను జగ్లింగ్ చేసిందిగా.. వీడియో చూస్తే!

కొందరు వ్యక్తులు తమ ప్రత్యేకమైన ప్రతిభను ఇంటర్నెట్ వేదికగా షేర్ చేసి సామాన్యులను ఆశ్చర్యపరుస్తుంటారు.

కాగా తాజాగా ఒక యువతి తన చేతులు, కాళ్లతో ఐదు బాస్కెట్‌బాల్‌లను ఒకేసారి జగ్లింగ్ చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది.

ఈ ప్రత్యేకమైన టాలెంట్ కు సంబంధించి ఓ 48 సెకన్ల వీడియో క్లిప్ మొదటగా రెడిట్‌లో షేర్ చేశారు.ఈ వీడియోలో టీ-షర్ట్, టైట్స్ ధరించిన ఒక యువతి కుర్చీపై తలక్రిందులుగా పడుకుని ఉండటం చూడవచ్చు.

తర్వాత ఆమె 5 బాస్కెట్‌బాల్‌లను తన కాళ్లు, చేతుల పైకి తీసుకోవడం గమనించవచ్చు.ఆపై ఆ యువతి ఒకేసారి ఆ ఐదు బాల్స్‌ను తన కాళ్లు, చేతులపై తిప్పుతూ ఆశ్చర్యపరిచింది.

సాధారణంగా రెండు, మూడు బాల్స్‌ను జగ్లింగ్ చేయడానికి చాలామంది చాలా కాలం పాటు సాధన చేస్తుంటారు.అలాంటిది ఈ యువతి తలకిందులుగా పడుకుని ఐదు బాల్స్ ను ఒకేసారి జగ్లింగ్ చేసి అందర్నీ స్టన్ అయ్యేలా చేస్తోంది.

Advertisement

ముందుగా రెండు బంతులు కాళ్లపై తిప్పిన ఆమె ఆ తర్వాత మరో మూడు బంతులు చేతిలోకి తీసుకుని వాటిని కూడా జగ్లింగ్ చేసింది.ఏ ఒక్క బంతి కూడా కింద పడిపోకుండా చాలా ఫాస్ట్ గా ఆమె ఈ జగ్లింగ్ షో చేసి మంత్రముగ్ధుల్ని చేసింది.

వీడియో చివర్లో, ఆమె ప్రతి బాల్‌ను టేబుల్‌గా కనిపించే దాని మీద జాగ్రత్తగా ఉంచుతుంది.ఆపై కెమెరాకు పోజులిచ్చింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు వావ్ ఇది ఇన్క్రెడిబుల్ అని కామెంట్స్ చేస్తున్నారు.

అటువంటి నైపుణ్యాన్ని సంపాదించడానికి ఆమె ఎంత ప్రాక్టీస్ చేసిందో ఏమో అని ఇంకొక యూజర్ కామెంట్ పెట్టారు.ఈ వండర్‌ఫుల్ వీడియోని మీరు కూడా చూసేయండి.

వీడియో: గుర్రాన్ని గెలికిన బుడ్డోడు.. లాస్ట్ ట్విస్ట్ చూస్తే గుండె బద్దలు..
Advertisement

తాజా వార్తలు