ఎన్టీఆర్‌‌‌ను ఫాలో అవుతున్న పవన్.. చైతన్య రథంలా కొత్త బస్సు!

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి.వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటి నుండే సన్నాహాలు మొదలుపెట్టాయి.

ఇక జనసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ రాష్ట్ర వ్యాప్త బ‌స్సుయాత్రకు సిద్దమవుతున్నారు.విజ‌య‌ద‌శ‌మి నుంచి ఈ యాత్రకు శ్రీ‌కారం చుట్టనున్నారు.

ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఆరుశాతం ఓట్లతో, ఒకే ఒక్క స్థానానికి పరిమితమైన జ‌న‌సేన వచ్చే ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా మారాలని చూస్తోంది.ఈ యాత్ర కోసం అన్ని వసతుల ఉన్న ప్రత్యేక బస్పును పార్టీ నేతలు రూపొందిస్తున్నారు.

ప్రస్తుతం ముంబ‌యిలో ఈ బస్సు సిద్ధమ‌వుతోంది.టీటైమ్ ఔట్‌లెట్స్ పౌండర్ ఉద‌య్‌ ఈ బస్సు పర్యవేక్షణ బాధ్యతను చూస్తున్నారు.

Advertisement
Special Bus Similar To Ntrs Chaitanya Similar To Ntrs Chaitanya For Pawan Kalyan

ఉదయ్ ఇటీవ‌లే జ‌న‌సేన‌లో చేరిన విషయం తెలిసిందే.ఈ యాత్ర ఎన్నిక‌లు జరిగే వరకు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

దానికి తగ్గట్లుగానే అవసరమైన బస్సు రూపొందిస్తున్నారు.బస్సు బాడీ దృఢంగా ఉండేలా.

ప్రజలను ఆకర్షించేలా మిలిట‌రీ ఆకుప‌చ్చ రంగును వాడుతున్నారు.బస్సుకు రెండువైపులుగా బార్‌లు, ప్లాట్‌ఫామ్స్ ఉండనున్నాయి.

పవన్ రక్షణగా ఒక‌వైపు ఆరుగురు, మ‌రోవైపు ఆరుగురు బాడీ గార్డులు నిల‌బ‌డేలా డిజైన్ చేశారు.యాత్ర సమయంలో పవన్ ప్రజలకు కనబడేలా.

ఆ ఈవెంట్ లో అవమానం.. నితిన్ సారీ చెప్తాడని వెళ్తే అలా జరిగింది.. హర్షవర్ధన్ కామెంట్స్ వైరల్!
మైత్రీ నిర్మాతలపై ఊహించని స్థాయిలో భారం.. అన్ని వందల కోట్లు రాబట్టాలా?

నేరుగా టాప్ మీద‌కు చేరుకులా ఏర్పాట్లు చేశారు.

Special Bus Similar To Ntrs Chaitanya Similar To Ntrs Chaitanya For Pawan Kalyan
Advertisement

నాటి ఎన్టీఆర్ చైత‌న్య ర‌థం స్పూర్తిగా ఈ బస్సును రూపొందిస్తున్నారు.1983లో ఎన్టీఆర్ చైత‌న్య ర‌థం ఎలా ఉందో ఆ మోడ‌ల్‌ను తీసుకొని ఈ వాహనాన్ని డిజైన్ చేయిస్తున్నారు.దాదాపు ఏపీలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు చూట్టేలా యాత్ర షెడ్యూల్‌ను తయారుచేశారు.

యాత్రలో పాల్గోనే జన సైనుకుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఈ యాత్ర ప్రారంభించే లోపు ఒప్పుకున్న సినిమాలను పూర్తిచేయాలని పవన్ యోచిస్తున్నారు.

ఆ సినిమా తర్వాత వేంటనే యాత్రలో పాల్గోంటారు పవన్. ఇక యాత్రకు కొద్దిరోజులే సమయం ఉండడంతో పార్టీ నాయకులు ఏర్పాట్లపై దృష్టి సారించారు.

నాగబాబు ఏర్పాట్లను పర్వవేక్షిస్తున్నారు.

తాజా వార్తలు