కరోనా కారణంగా హాస్పిటల్లో జాయిన్ అయినా ఎస్పీ బాలసుబ్రమణ్యం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.ఆయనకు కరోనా నెగటివ్ వచ్చినా కూడా ఇతర అనారోగ్య సమస్యల వల్ల మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటించారు.
ఆయన గాయకుడు గానే కాకుండా బుల్లితెర ప్రేక్షకులను అలరించారు. పాడుతా తీయగా అంటూ 1996 లో ఆయన ఈటీవీ లో ఒక పాటల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు పాడుతా తీయగా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటూనే ఉంది.
పాతికేళ్లుగా కొనసాగుతున్న పాడుతా తీయగా తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది.
ఎంతో మంది గాయనీ గాయకులు పాడుతా తీయగా వల్ల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఉన్న యువ గాయని గాయకులు ఎక్కువ శాతం మంది పాడుతా తీయగా ద్వారా వచ్చినవాళ్ళు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
పాతికేళ్లుగా ఈ టివి లో ప్రసారమైన పాడుతా తీయగా కార్యక్రమం ఎన్నో సీజన్ లో ప్రసారమయి ఎంతో మంది ఔత్సాహిక గాయకులు తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది.అద్భుతమైన కార్యక్రమం గా పాడుతా తీయగా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తెలుగు ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ నిలిచిపోయే పాడుతా తీయగా కార్యక్రమం పాతికేళ్లు పూర్తయినా ఈ సందర్భంగా భారీ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్న సమయంలో బాల సుబ్రహ్మణ్యం మృతి చెందడంతో కార్యక్రమ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు.బాలు వెళ్లి పోవడంతో పాడుతా తీయగా కార్యక్రమం కూడా నిలిపివేసే అవకాశం ఉందని ఈ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు ఈ షో ను ఇష్టపడేవారు.బాలు గారు ఎంతో సరదాగా చక్కని వాతావరణంలో ఇంగ్లీష్ ఎక్కువగా లేకుండా ఈ కార్యక్రమాన్ని బాలు నిర్వహించే వారు.
మరెవ్వరు కూడా పాడుతా తీయగాను బాలు గారి స్థాయిలో నడిపించలేరు.