గంభీరావుపేట పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) ఎస్పీ బుధవారం ఆకస్మికంగా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలు,రికార్డుల నిర్వహణ రిసెప్షన్, జీడీ ఎంట్రీ తదితర రికార్డును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.

మారుతున్న నేరాల నమూనాకు అనుగుణంగా గస్తీ, పేట్రోలింగ్ లను పెంచాలన్నారు.

స్టేషన్లలో క్రైమ్ పాట్రాన్స్, ఫంక్షనల్ వర్టీకాల్స్ పనితీరు పరిశీలించి 5s ఇంప్లిమెంటేషన్ పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు.ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు.

బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24x7 గస్తీ నిర్వహిస్తూ,డయల్ 100 కాల్( Dial 100 ) రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యలు పరిష్కరించాలని అన్నారు.విలేజ్ పోలీస్ అధికారులు తమకు కేటాయించిన గ్రామాల్లో తరచు పర్యటిస్తూ గ్రామాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందరి దగ్గర ఉండాలని అన్నారు.

నేరాల నియంత్రణ లో సీసీ కెమెరాలు కీలకం అని కమ్యూనిటీ పోలీసింగ్ లో మినిమమ్ ఫోర్ సీసీటీవీ కెమెరాస్ ఫర్ విలేజ్ ప్రొజెక్ట్ లో భాగంగా మండల పరిధిలోని ప్రతి గ్రామంలో నాలుగు సిసి కెమెరాలను ఏర్పాటు చేసే విధముగా ప్రజలను అవగాహన పరచాలని ఎస్పీ సూచించారు.ఎస్పీ వెంట డిఎస్పీ ఉదయ్ రెడ్డి,సి.

Advertisement

ఐ శశిధర్ రెడ్డి, ఎస్.ఐ మహేష్ సిబ్బంది ఉన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News