కొరియాలో సైతం చరణ్ కు ఊహించని రేంజ్ లో క్రేజ్.. మెగా హీరో వావ్ అనిపించాడుగా!

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్(Hero Ram Charan )ప్రస్తుతం నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు రామ్ చరణ్.

ఆర్ఆర్ఆర్(RRR) సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.కాగా ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

కాగా చెర్రీ ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

హాలీవుడ్ లో, జపాన్ లో రామ్ చరణ్ ఇప్పటికే ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు.నాటు నాటు పాటతో అనేక దేశాల్లో చరణ్ గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇప్పుడు చరణ్ క్రేజ్ సౌత్ కొరియాకు కూడా పాకింది.

Advertisement

సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ (Ram Charan is a game changer)సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు సాంగ్ లు విడుదల కాగా అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

ఇటీవల వచ్చిన రా మచ్చ రా మచ్చ సాంగ్ మంచి వైబ్ తో ఫ్యాన్స్ ని, ఆడియన్స్ ని మెప్పిచింది.

ఇటీవల ప్రముఖ కొరియన్ పాప్ సింగర్ పార్క్ మిన్ జున్(Park Min Jun) తన టీమ్ తో కలిసి గేమ్ ఛేంజర్ లోని రా మచ్చ రా మచ్చ.సాంగ్ కి స్టెప్స్ వేసాడు.ఈ డ్యాన్స్ వీడియో కొంచెం లేట్ అయినా ప్రస్తుతం వైరల్ గా మారింది.

దీంతో చరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ సినిమాకు గ్లోబల్ రీచ్ వస్తుంది, అందుకే చరణ్(charan) ని గోబర్ స్టార్ అనడంలో తప్పులేదు అని కామెంట్స్ చేస్తున్నారు.ఈ కొరియన్ సింగర్ చేసిన డ్యాన్స్ వీడియోని చరణ్ ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ నాకన్నా చిన్నోడు... నన్ను మాత్రం ఒరేయ్ అని పిలుస్తాడు : రాజీవ్ కనకాల 
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్5, శనివారం 2025

ఈ కొరియన్ పాప్ సింగర్ పార్క్ మిన్ జున్.ఔరా అనే స్టేజ్ నేమ్ తో కొరియాలో బాగా పాపులర్ పాప్ సింగర్.

Advertisement

పలు దేశాలు తిరుగుతూ అక్కడి సంప్రదాయాలు, అక్కడి సాంగ్స్ కి డ్యాన్స్ లు వేస్తూ మరింత వైరల్ అవుతున్నాడు పార్క్ మిన్ జున్.గతంలో కూడా పలు ఇండియన్ సాంగ్స్ కి ఇండియా వచ్చినప్పుడు డ్యాన్సులు వేసి అలరించిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు