పుట్టుకతోనే వృద్ధురాలిగా.అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి.
బిడ్డకు జన్మనివ్వడం తల్లికి ఎంత సంతోషం ఇస్తుందో మాటల్లో వర్ణించడం కష్టం ఐతే పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ తల్లి ఆనందిస్తుంది.అలా కాక ఏదైనా అనారోగ్య సమస్యతో జన్మిస్తే తల్లి హృదయం తల్లడిల్లుతోంది.
ఇదే పరిస్థితి ఎదురయ్యింది దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళకు.ఆమెకు జన్మించిన బిడ్డను చూసి జనాలు విచారం వ్యక్తం చేస్తున్నారు.
కానీ సదరు మహిళ ఏమాత్రం స్పందించడం లేదు కారణం తన మానసిక ఆరోగ్యం సరిగా లేదు.ఇక ఆమె జన్మనిచ్చిన చిన్నారి పుట్టుకతోనే వృద్ధురాలి గా కనిపిస్తుంది.
దక్షిణాఫ్రికా లోని తూర్పు కేప్లోని లిబోడ్ కు చెందిన గ్రామంలో మానసిక వికలాంగులైన 20 ఏళ్ల మహిళ ఈ ఏడాది జూన్ లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది.కానీ దురదృష్టం కొద్దీ ఆ చిన్నారి అత్యంత అరుదైన వైద్య సమస్యతో జన్మించింది.
ఆ చిన్నారి ప్రొజీరియా (హచిన్సన్ – గిల్పోర్డ్ సిండ్రోమ్) తో బాధ పడుతుంది.

ఈ వ్యాధి వల్ల చిన్నారి పుట్టుకతోనే వృద్ధురాలు గా కనిపిస్తుంది.వైద్యనిపుణుల నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది చాలా అరుదైన ప్రగతిశీల జన్యుపరమైన వ్యాధి.దీనివల్ల పిల్లలు వేగంగా వృద్ధాప్యం బారిన పడతారు.
చిన్నారి పుట్టిన వెంటనే తనలో ఏదో లోపం ఉందని ఆమె అమ్మమ్మ గుర్తించింది.అప్పుడే జన్మించిన చిన్నారి ముఖం ముడతలు పడి.వృద్ధురాలుల కనిపించడం ఆమెను కలవరపెట్టింది.