మన శరీరానికి అవసరమయ్యే అతి ముఖ్యమైన పోషకాల్లో ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ ముందు వరసలో ఉంటాయి.
గుండె ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలన్నా, రోగ నిరోధక శక్తి పెరగాలన్నా, వృద్ధాప్య ఛాయలు దరి చేరకూడదన్నా, ఎముకలు బలంగా మారాలన్నా, ఊపిరితిత్తులు ఆరోగ్యాంగా పని చేయాలన్నా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎంతో అవసరం.
అందుకే వైద్య నిపుణులు వారానికి రెండు సార్లు చేపలు తినమని సూచిస్తుంటారు.ఎందుకంటే, చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
అయితే శాకాహారులు చేపలు తినరు.ఇలాంటి వారు ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ను తీసుకోవడాన్ని పెద్ద సవాల్‌గా భావిస్తుంటారు.
ఏ ఏ ఆహారాలు తినాలో తెలియక తెగ సతమతమవుతుంటారు.అయితే నిజానికి చేపల్లోనే కాదు.
ఇప్పుడు చెప్పబోయే ఆహారాల్లోనూ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.మరి లేటెందుకు ఆ ఆహారాలు ఏంటో చూసేయండి.
చియా సిడ్స్..ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ కు గొప్ప మూలం అని చెప్పుకోవచ్చు.
అవును, రోజూ ఉదయాన్నే గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర స్పూన్ చియా విత్తనాలు కలిపి సేవిస్తే శరీరానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అద్భుతంగా అందుతాయి.అలాగే వాల్ నట్స్‌లోనూ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.
అందు వల్ల శాకాహారులు ప్రతి రోజూ గుప్పెడు వాల్ నట్స్ తింటే చాలా మంచిది.అవిసె గింజల్లోనూ ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా నిండి ఉంటాయి.
కాబట్టి, అవిసె గింజలను రోజూ ఏదో ఒక రూపంలో తీసుకుంటే శరీరంలో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ కొరత ఏర్పడకుండా ఉంటుంది.ఇక ఇవే కాకుండా ఆవ నూనె, సోయా బీన్ నూనె, రాజ్మా, పాలకూర, అవకాడో పండు, గుడ్డు వంటి వాటిల్లోనూ ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.
సో.వీటిని డైట్‌లో చేర్చుకుంటే మంచిది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy