తెలంగాణ కాంగ్రెసు నాయకులు సోనియా గాంధీ నాయకత్వాన్నే కోరుకుంటున్నారా? పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీకి అనుభవం చాలదనుకుంటున్నారా? సీనీయర్ నాయకుల మాటలు ఇలాగే ఉన్నాయి.కాంగ్రెసు రాజ్యసభ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఉమ్మడి రాష్ర్టంలో రాష్ర్ట కాంగ్రెసు అధ్యక్షుడిగా పనిచేసిన పి నర్సారెడ్డి సోనియా గాంధీవైపే మొగ్గు చూపుతున్నారు.
పార్టీని నడిపించే సరైన నాయకురాలు సోనియా గాంధీయేనని వీరు అంటున్నారు.రాహుల్ గాంధీకి అనుభవం చాలదని అభిప్రాయపడ్డారు.
కాబట్టి ప్రస్తుతంకాంగ్రెసు ఉన్న పరిస్థితిలో సోనియా గాంధీయే నాయత్వంలో కొనసాగుతారని అన్నారు.రాహుల్ గాంధీ పార్టీలోని అన్ని స్థాయిల్లో సంబంధాలు ఏర్పరచుకోవాలని గోవర్ధన్ రెడ్డి అన్నారు.
మే నెలో రాహుల్‌కు పార్టీ అధ్యక్షుడిగా పట్టాభిషేకం చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన నాయకత్వం మీ పార్టీ కేడర్లో అపనమ్మకం కలుగుతోందని అర్ధమవుతోంది.రాహుల్‌కు నాయకత్వ లక్షణాలు లేవని పార్టీలో చాలామంది నమ్ముతున్నారు.
కాని తల్లి సోనియాకు మాత్రం రాహుల్‌కు బాధ్యతలు అప్పగించాలని ఉంది.ఆయనే గనుక అధ్యక్షుడైతే పార్టీ ఈ మాత్రం కూడా ఉనికిలో ఉంటుందా అనే సందేహం చాలామందిలో ఉంది.
ఎక్కువమంది నాయకులు ప్రియాంక గాంధీని రాజకీయాల్లోకి తెస్తే బాగుంటుందని అంటున్నారు.కాని అది నెరవేరే పరిస్థితి కనబడటంలేదు.