తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ప్రభావం ఏమిటో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది.పార్టీ ఏర్పాటు సమయంలో చాలా గొప్పగా ప్రజెంటేషన్ చేసిన, పెద్ద ఎత్తున నాయకులు చేరబోతున్నట్లు హడావుడి నడిచినా, చివరకు మాత్రం ఆశించిన ఫలితం కనిపించడం లేదు నాయకులు చేయకపోగా ,అనవసరంగా చేరాము అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది.
పార్టీని వీడి బయటకు వెళ్లిపోతున్నారు తప్ప కొత్తగా పార్టీలో చేరేందుకు ఎవరూ ఆసక్తి చూపించకపోవడం తో తెలంగాణలోని మిగతా పార్టీలను వారు ఆశ్రయిస్తూ, ప్రజల్లో బలం పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.ఇలా ఎన్నో అంశాలు షర్మిల పార్టీ వైఎస్ఆర్ టిపికి తలనొప్పులు తీసుకువస్తున్నాయి.
ఇప్పుడే కాదు భవిష్యత్తులో ను పార్టీలో కీలక నాయకులు ఎవరు చేరే అవకాశం కనిపించకపోవడంతో షర్మిల పార్టీ నిరాశ నిస్పృహ లు అలుముకున్నాయి.తెలంగాణలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా, కాంగ్రెస్ బిజెపి స్థాయి పార్టీగా వైఎస్సార్ సీపీ తీర్చిదిద్దేందుకు షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారు ఆదిలోనే హంసపాదు అన్నట్లు గా తయారయ్యాయి.
ప్రస్తుతం చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర ఇబ్బందికరంగా మారడంతో ఒక్కసారిగా రాజకీయం మార్చాలని డిసైడ్ అయ్యారు.ఈ మేరకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహాయం తీసుకునేందుకు షర్మిల సిద్ధమయ్యారు.
పార్టీ ఏర్పాటు సమయంలోనే ప్రశాంత్ కిషోర్ షర్మిలకు రాజకీయ వ్యూహాలు అందిస్తున్నారు అనే ప్రచారం జరిగినా, ఆయన జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉండి పోవడంతో అది వర్కౌట్ కాలేదు.అది కాకుండా ఇకపై ఏ పార్టీకి రాజకీయ వ్యూహాలు అందించే ఉద్దేశం లేదని ప్రశాంత్ కిషోర్ ప్రకటించేశారు .ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ద్వారా కేంద్రంలో బిజెపిని అధికారానికి దూరం చేస్తూ, కాంగ్రెస్ ను ఆస్థానంలో కూర్చోబెట్టాలనే వ్యూహంతో పని చేస్తున్నారు.అయితే ఏపీ సీఎం జగన్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా షర్మిల పార్టీకి కి తన ఐ ప్యాక్ టీమ్ ద్వారా రాజకీయ వ్యూహాలు అందించే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే ప్రియా అనే రాజకీయ వ్యూహకర్త షర్మిల కోసం పనిచేస్తున్నారు.అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రియ రాజకీయ వ్యూహాలు కంటే ప్రశాంత్ కిషోర్ పర్యవేక్షణలో కొంతకాలం పార్టీని నడిపితేనే వర్కవుట్ అవుతుంది అనే అభిప్రాయంతోనే షర్మిల ఈ ప్లాన్ వేసినట్టుగా అర్థమవుతోంది.ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ టీం సిబ్బంది షర్మిల కోసం రంగంలోకి దిగి, పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.