సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గవర్నర్ తమిళ్ సై పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.గవర్నర్ ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి.
అని కూనంనేని మండిపడ్డారు.ఇది విమోచనమో… విలీనమో గవర్నర్ కి ఎందుకని ప్రశ్నించారు.
ఇదే సమయంలో గవర్నర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.గవర్నర్ తనకు మించిన పనులు చేస్తుందని.
ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థ ప్రజలకు పనికిరాదని కూనంనేని సంచలన వ్యాఖ్యలు చేశారు.
సెప్టెంబర్ 17వ తారీఖున విలీనం దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.దేశంలో గవర్నర్ వ్యవస్థ వల్ల చాలా ప్రభుత్వాలు రద్దు చేయడం జరిగిందని కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.
అప్పట్లో ఎన్టీ రామారావు ప్రభుత్వం మొన్న జార్ఖండ్ ప్రభుత్వం ఇంకా చాలా ప్రభుత్వాలను గవర్నర్ వ్యవస్థ వల్ల రద్దు చేయడం జరిగిందని గుర్తు చేశారు.దేశంలో గవర్నర్ వ్యవస్థ వల్ల ప్రజలకు ఎక్కడా కూడా ఎటువంటి ఉపయోగం లేదని కూనంనేని అన్నారు.







