ఇప్పటివరకు ఒక రూపం ఏర్పడని ‘జనసేన’ పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి గళం విప్పారు.గంభీరమైన ప్రకటన చేశారు.
మళ్లీ ప్రజల్లో ఆశలు చిగురింపచేశారు.ఇంతకూఆయన ఏం చేశారు? ఆంధ్ర ప్రదేశ్‌లో రాజధాని బాధిత రైతులకు తాను అండగా ఉంటానన్నారు.రాజధాని కోసం రైతుల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుందని ఇప్పటికే గగ్గోలు పుడుతోంది.కొందరు భూములు ఇచ్చేందుకు నిరాకరించారు.కోర్టులకువెళ్లారు.న్యాయపోరాటం చేస్తున్నారు.
ప్రతిపక్షాలు వారి తరపున పోరాడుతున్నాయి.భూసేకరణ పరిధిలోని గ్రామాల రైతులు గతంలోనే పవన్ కళ్యాణ్ దగ్గర తమ బాధలు చెప్పుకున్నారు.
ఆయన వారిని ఊరడించి పంపారుగాని ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగలేదు.గత నెలలో ఉండవల్లి, పెనుమల, తుళ్లూరు గ్రామాల్లో పర్యటించారు.
గోడు వెళ్లబోసుకున్న రైతులకు భయపడొద్దంటూ ధైర్యం నూరిపోశారు.తాను పోరాటం చేస్తానన్నారు.
కాని ఆయన పోరాటం మాటల వరకే పరిమితమవుతోంది.గ్రామాల్లో రైతులను ఓదార్చిన పవన్ హైదరాబాద్ రాగానే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశంసించారు.
అక్కడోమాట, ఇక్కడో మాట మాట్లాడి గందరగోళం చేశారు.ఇప్పుడు మళ్లీ రైతుల తరపున మాట్లాడుతున్నారు.
పవన్ వ్యవహారం అర్ధం కాకుండా ఉంది.







