భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం.. కన్నతల్లిని హత్య చేసిన కసాయి కొడుకు..!

సమాజంలో కొందరు వ్యక్తులకు కుటుంబ సభ్యుల కంటే, కన్న తల్లిదండ్రుల కంటే ఆస్తిపాస్తులే ఎక్కువ.

ఆస్తుల కోసం( Property Disputes ) కన్నతల్లిదండ్రులనే దారుణంగా హత్య చేసే వ్యక్తుల మధ్య మనమంతా జీవిస్తున్నాం.

సమాజంలో మానవత్వానికి చోటు లేదు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.స్థలం విషయంలో జరిగిన ఘర్షణలో కన్నతల్లినే రోకలి బండతో అత్యంత దారుణంగా కొట్టి హత్య చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా( Bhadradri Kothagudem ) ఇల్లెందు మండలం మొదుగులగూడెంలో శుక్రవారం చోటుచేసుకుని స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.సీఐ కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.

మొదుగుల గూడెం లో మెరుగు పద్మ (60) కు( Merugu Padma ) ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం.చిన్న కుమారుడు వేణు గతంలో ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

ఇక పెద్ద కుమారుడు యాకయ్య 8 సంవత్సరాల క్రితం మహబూబాబాద్ జిల్లా విస్సంపల్లి కి వలస వెళ్లి అక్కడే నివాసం ఉంటున్నాడు.

యాకయ్య( Yakaiah ) తరచూ తన తల్లితో ప్రతి విషయంలో ఘర్షణ పడుతూ ఉండేవాడు.గృహలక్ష్మి పథకానికి( Gruhalakshmi Scheme ) దరఖాస్తు చేసుకునేందుకు రెండు రోజుల క్రితం భార్యతో కలిసి మొదుగుల గూడెం వచ్చాడు.ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి జాగాలో గృహలక్ష్మి పథకం కింద ఇల్లు నిర్మించుకునేందుకు మెరుగు పద్మ దరఖాస్తు చేసుకుంది.

ఆ పక్కనే ఉన్న స్థలంలో ఇంటి కోసం దరఖాస్తు చేసుకోవాలని పెద్ద కుమారుడు యాకయ్యకు సూచించింది.అయితే యాకయ్య తనకు గౌడ సంఘం తరఫున బొజ్జాయిగూడెంలో మంజూరు చేసిన స్థలమే కావాలని తల్లిని కోరాడు.

ఆ స్థలం ఆడబిడ్డ ఉమారానికి ఇస్తానని తల్లి చెప్పడంతో కాసేపు గొడవపడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.తాజాగా శుక్రవారం మధ్యాహ్నం భార్య కవితతో కలిసి యాకయ్య మొదుగుల గుడెం వచ్చి తల్లి లో గొడవపడ్డాడు.క్రమంగా గొడవ పెరగడంతో ఇంట్లో ఉండే రోకలిబండతో తల్లి తలపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే తల్లి పద్మ మృతి చెందింది.

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
అయ్యయ్యో.. అలా పొగిడాడో లేడో.. ఇలా పడిపోయిన మహిళా బైకర్ (వీడియో)

స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు