న్యాచురల్ స్టార్ నాని ( Nani )నటిస్తున్న సరికొత్త మూవీ ”హాయ్ నాన్న’‘.( Hi Nanna ) ఎప్పుడు డిఫరెంట్ గా ఫ్యామిలీ మొత్తం చూసే మంచి మంచి సినిమాలతో అలరించే నాని ఈసారి కూడా అలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
దసరా వంటి బ్లాక్ బస్టర్ అందుకుని మంచి ఊపు మీద ఉన్న నాని నెక్స్ట్ చేయబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమా ఇచ్చిన హిట్ తో నానిలో ఆలోచన పెరిగింది.ఇది వరకులా వెంటవెంటనే సినిమాలు చేయకుండా ఆచి తూచి నిర్ణయం తీసుకుంటున్నారు.అందుకే ఎప్పుడు మూడు నాలుగు ప్రాజెక్టులతో బిజీగా ఉండే నాని కేవలం ఇప్పుడు చేస్తున్న హాయ్ నాన్న సినిమా మినహా మరో సినిమాను అనౌన్స్ చేయలేదు.
ఈ సినిమాతో డిసెంబర్ లో రిలీజ్ కు సిద్ధం అవుతున్నాడు.
అయినప్పటికీ ఇంకా మరో సినిమాను అనౌన్స్ చేయలేదు.
నాని దసరా( Dasara ) అనుభవం, హాయ్ నాన్న అవుట్ ఫుట్ నేపథ్యంలో కొంత సమయం తీసుకునే స్టార్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నారట.అందుకే ఈయన కోసం ఎంత మంది డైరెక్టర్లు క్యూలో ఉన్న ఈయన ఓకే చెప్పలేదట.
ఈయన అంటే సుందరానికి ఫేమ్ వివేక్ ఆత్రేయతో చేస్తున్నాడని మధ్య టాక్ వచ్చింది.
అంతేకాదు దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో కూడా చేస్తున్నట్టు టాక్ వచ్చింది.ఆ తర్వాత తమిళ్ డైరెక్టర్ తో కూడా చేయబోతున్నాడు అంటూ ఎన్నో రూమర్స్ వచ్చిన ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ అయితే లేదు.మరి ఈ అప్షన్స్ లో నాని హాయ్ నాన్న పూర్తి అయ్యే లోపు ఏది పిక్ చేసుకుంటాడో చూడాలి.
కాగా ఈ సినిమాను డైరెక్టర్ శౌర్యన్ తెరకెక్కిస్తుండగా మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఇందులో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తో పాటు బేబీ కియారా ఖన్నా కూడా కీ రోల్ పోషిస్తున్నారు.
వైరా ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడు.డిసెంబర్ 21న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.