ఢిల్లీలో చక్రం తిప్పుతున్న కిరణ్ ! హడావుడి పడుతున్న వీర్రాజు 

రానున్న రోజుల్లో ఏపీ బీజేపీ( AP BJP )లో మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది.

ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి( Nalla Kiran Kumar Reddy ) బిజెపిలో చేరడం, ఆయనకు పార్టీ హై కమాండ్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండడంతో పాటు,  త్వరలోనే కీలక పదవి ఆయనకు అప్పగించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతూ ఉండడంతో,  ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కాస్త కంగారు పడుతున్నారు.

దీనికి తగ్గట్లుగానే పార్టీలో చేరిన వెంటనే ఢిల్లీలోని బిజెపి కీలక నేతల అందరితోను కిరణ్ కుమార్ రెడ్డి వరుసగా భేటీ అయ్యారు.

ఒకేరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా( Union Minister Amit Shah ), బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా( BJP President JP Nadda ), మరో కీలక నేత బి ఎల్ సంతోష్ లను కలిశారు.అయితే కిరణ్ కుమార్ రెడ్డి వెంట  సోము వీర్రాజు లేరు.  ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాత్రమే ఉన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి,  మరికొంతమంది బిజెపి కీలక నేతలను కలుస్తూ అనేక అంశాలపై చర్చిస్తుండగానే.ఢిల్లీ నుంచి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు( Somu Veerraju )కు పిలుపు వచ్చింది.

Advertisement

దీంతో  ఢిల్లీలో ఏం జరగబోతోంది ? కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి అగ్ర నాయకులను కలిసిన వెంటనే వీర్రాజుకు పిలుపు రావడంతో,  ఏపీ లో పొత్తుల అంశంపై చర్చించేందుకే పిలిపించారా లేక మరేదైనా కీలక విషయాన్ని ప్రస్తావించేందుకా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Leader Pawan Kalyan ) ఢిల్లీకి వెళ్లి వచ్చారు.ఈ సందర్భంగా ఏపీలో టిడిపి ని కలుపుకు వెళ్లే విషయంపై పవన్ బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో చర్చించారు  దీంతో ఇప్పుడు ఆ విషయంపైనే చర్చించేందుకు సోము వీర్రాజును పిలిపించారా అనేది అందరికీ ఆసక్తికరంగానే మారింది.ఇక కిరణ్ కుమార్ రెడ్డి చేరిక తో  తనకు ప్రాధాన్యం తగ్గే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్న సోము వీర్రాజు అధిష్టానం పెద్దల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారట.

Advertisement

తాజా వార్తలు