తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్య సలహాదారుగా మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.ఈ మేరకు ఉదయం ఆయన బాధ్యతలను చేపట్టారు.
దాదాపు మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.అయితే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ సుదీర్ఘ కాలం విధులు నిర్వహించిన సంగతి తెలిసిందే.
తరువాత ఆయనను తెలంగాణలో కొనసాగిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను డీవోపీటీ హైకోర్టులో సవాల్ చేసింది.ఈ నేపథ్యంలో ఏపీలో రిపోర్టు చేయాలంటే న్యాయస్థానం సోమేశ్ కుమార్ కు ఆదేశాలు ఇచ్చింది.
దీంతో ఆయన ఏపీ జీఏడీలో రిపోర్ట్ చేశారు.కొన్ని రోజుల అనంతరం స్వచ్ఛంద పదవీ విరమణ చేయడంతో కేసీఆర్ ప్రభుత్వం ఆయనను ముఖ్య సలహాదారుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.