సాధారణంగా సినిమాలో యువతను సమాజాన్ని చెడగొడుతుందని చాలామంది విమర్శలు చేస్తుంటారు.అయితే దీనికి రివర్స్ లో కామెంట్లు చేసి షాక్ ఇచ్చింది స్టార్ హీరోయిన్ విద్యాబాలన్.
( Vidyabalan ) బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్ పాల్గొన్నది.అందులో మాట్లాడుతూ ‘సినిమాలను చెడగొట్టేది సమాజమే గానీ సమాజాన్ని తప్పుదారి పట్టించేది మాత్రం సినిమాలు కాదు’ అని పాపులర్ హిందీ పోయెట్, స్క్రీన్‌రైటర్ జావేద్ అఖ్తర్( Javed Akhtar ) చెప్పినట్లు విద్యా బాలన్ పేర్కొన్నది.
కేరళలోని పాలక్కాడు తమిళ బ్రాహ్మణ అయ్యర్ కుటుంబంలో విద్యా బాలన్ జన్మించింది.సమాజానికి( Society ) సరైన మార్గాల్లో నడిపించే బరువుబాధ్యతలను కొందరు అన్యాయంగా సినిమాపై వేస్తున్నారని ఆమె అప్పటినుంచి చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
ఇప్పుడు కూడా అదే మాటలు మాట్లాడింది.ప్రజలను సన్మార్గంలో నడిపించే బాధ్యత సినిమాలకు( Movies ) లేదు అని ఆమె మాట్లాడింది.సినిమాలకు సమాజాన్ని ప్రభావం చేసే శక్తి ఏమాత్రం లేదని ఆమె కుండ బద్దలు కొట్టింది.సమాజానికి ఏది మంచో ఏది చెడు చెప్పాల్సిన అవసరం లేదని కూడా తెలిపింది.
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలను కూడా చాలా కొద్ది మంది మాత్రమే చూస్తారని, అలాంటప్పుడు మొత్తం సమాజం ఎలా ప్రభావితం అవుతుంది అని ఆమె ప్రశ్నించింది.

‘సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి సినిమాలకు లేదని జావేద్ సర్ ఎప్పుడో చెప్పారు,’ అని విద్యా బెంగళూరు ఈవెంట్ లో గుర్తు చేసింది.ప్రముఖ కవి జాన్ నిస్సార్ అక్తర్ కుమారుడు జావేద్, సినీ నిర్మాత రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) కూడా సేమ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు.సినిమాలు ప్రజల ఆలోచనలను లేదా చర్యలను ప్రభావితం చేయలేవని వారు నమ్ముతారు.

గతంలో వర్మ తీసిన ఓ వివాదాస్పద సినిమాపై చర్చించేందుకు ప్రోగ్రెస్సివ్ ఉమెన్స్ అసోసియేషన్ (పీఓడబ్ల్యూ) నాయకురాలు వి.సంధ్య ఓ తెలుగు టీవీ ఛానెల్‌లో ప్రత్యక్షమయ్యారు.ఆమె సినిమాపై తీవ్ర విమర్శలు చేస్తూ.“మీ సినిమాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి.దర్శకుడిగా పాజిటివ్ మెసేజ్ అందించడం మీ బాధ్యత.” అని తీవ్ర ఆగ్రహంతో, భావోద్వేగంతో మాట్లాడింది.
అయితే ఈ విమర్శలకు రాంగోపాల్ వర్మ కౌంటర్ ఇస్తూ “నా సినిమాల ద్వారా గుడ్ మెసేజ్ ఇవ్వడం నా పని కాదు.అంతిమంగా, నా సినిమాలు మంచివా లేదా చెడ్డవా అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు.
నాకు ఒక సినిమా మంచిది చెడ్డది అని చెప్పే ఓపిక లేదు.విద్యాబాలన్ నటించిన నా ‘డర్టీ పిక్చర్’ చిత్రాన్ని( Dirty Picture Movie ) మీరు ఎలా వర్గీకరిస్తారు?” అని తనదైన స్టైల్ లో జవాబు చెప్పాడు.