జగన్‌ వంద రోజుల పాలనపై నెటిజన్స్‌ స్పందన ఏంటో తెలుసా?

ప్రత్యేక ఆంధ్రప్రదేశ్‌ రెండవ సీఎంగా వైకాపా అధినేత జగన్‌ మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తి అయ్యింది.

ఈ వంద రోజుల్లో జగన్‌ చేసిన పనులు ఏంటీ, ఆయన్ను ప్రజలు ఎలా ఓన్‌ చేసుకున్నారు అనే విషయమై సోషల్‌ మీడియాలో పలు సంస్థలు సర్వేలు నిర్వహించాయి.

తెలుగు దేశం పార్టీని కాదని ఎంతో అనుభవజ్ఞుడు అయిన చంద్రబాబు నాయుడును కాదని జగన్‌పై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు ఆయన వంద రోజుల పాలన పట్ల పర్వాలేదు అన్నట్లుగా ఉన్నట్లుగా సర్వే ఫలితాలు తెలుపుతున్నాయి.జగన్‌ పాలన విషయంలో 60 శాతం మంది సంతృప్తిగా ఉన్నట్లుగా సోషల్‌ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది.

మరో వైపు తెలుగు దేశం పార్టీ మాత్రం తాము అయిదు సంవత్సరాల్లో చేసిన అభివృద్దిని ఈ వంద రోజుల్లో నాశనం చేశాడంటూ జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.ప్రస్తుతం ఏపీ పురోగమనంలో సాగుతోంది అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు అసహనంతో ఉన్నారు.

పార్టీకి చెందిన ముఖ్య నాయకులు అక్రమాలకు పాల్పడుతు, కక్ష సాదింపు చర్యలకు పాల్పడుతున్నట్లుగా తెలుగు దేశం పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.తెలుగు దేశం పార్టీ గతంలో ప్రారంభించిన పలు సంక్షేమ మరియు అభివృద్ది కార్యక్రమాలను ఆపేయడంతో వైకాపా ప్రభుత్వం ప్రజలను దిగ్బ్రాంతులకు గురి చేస్తుందని అంటున్నారు.

Advertisement

పోలవరం నిలిపేయడంతో పాటు రాజధాని నిర్మాణంపై నీలి నీడలు కమ్మేలా చేస్తున్నారు అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు అన్నారు.అయితే వైకాపా నాయకులు మాత్రం గత అయిదు సంవత్సరాల్లో సాధ్యం కానిది 100 రోజుల్లో సాధ్యం అయ్యిందని అంటున్నారు.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు