కుమారస్వామి అరెస్ట్‌ తప్పదా?

బీజేపీ రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు దేశంలోని విపక్ష పార్టీల నాయకుల్లో భయం కలిగిస్తున్నాయి.గతంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా వ్యవహరించి దేశంలోనే పవర్‌ ఫుల్‌ లీడర్‌గా పేరు దక్కించుకున్న చిందంబరం ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఉన్నాడు.

 Congress Seniourleader Kumaraswamy Arrestinsoon Swamy-TeluguStop.com

గతంలో తనను జైలుకు పంపించిన కారణంగానే అమిత్‌ షా ఇప్పుడు చిదంబరంను జైలుకు పంపించాడు అంటూ దేశం మొత్తం కోడై కూస్తుంది.కాని బీజేపీ మాత్రం అలాంటిది ఏమీ లేదని, చట్టం తన పని తాను చేసుకు పోతుంది అన్నట్లుగా మాట్లాడుతున్నారు.

ఈ విషయమై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విపరీతమైన చర్చ జరుగుతోంది.

ఇక కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శివకుమార్‌ కూడా అరెస్ట్‌ అయ్యాడు.

ఆయన్ను కూడా బీజేపీ నాయకులు కావాలని అరెస్ట్‌ చేయించారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.పలువురు నాయకులకు బీజేపీ అధినాయకత్వం చుక్కలు చూపిస్తోంది.

తాజాగా మొన్నటి వరకు కర్ణాటక సీఎంగా ఉన్న కుమార స్వామికి కూడా సీబీఐ చుక్కలు చూపించబోతున్నట్లుగా ప్రచారం జరుగోతుంది.ఒక భూమి కేసులో కుమార స్వామిని ఇప్పుడు అరెస్ట్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పదేళ్ల క్రితం విషయంను ఇప్పుడు తెరపైకి తీసుకు రావడంతో అంతా కూడా కుమారస్వామిని తొక్కేసేందుకు పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి బీజేపీ రెండవ సారి అధికారంలోకి వచ్చి ముఖ్యంగా అమిత్‌ షా హోం మంత్రి అయిన తర్వాత పాత కేసులు అన్ని ఇప్పుడు సీరియస్‌ అవ్వడంతో ఆయన గురించి ఇతర నాయకులు కూడా భయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube